గత ఏడాది సంచలన విజయం సాధించిన `ఆర్ ఎక్స్ 100` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే యువతరంలో మంచి ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది ఈ అమ్మడు. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న పాయల్… `ఆర్ ఎక్స్ 100` తరువాత ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తోంది. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భాను శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో… పాయల్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన ఊరి ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడే యువతి పాత్రలో పాయల్ కనిపిస్తుందట. అలాగే కొన్ని ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంటాయని… ముఖ్యంగా కబడ్డీ నేపథ్యంలో సాగే ఫైట్ సీక్వెన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని ఇన్ సైడ్ సోర్స్ టాక్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా… పాయల్‌కి జోడీగా `హుషారు` ఫేమ్ తేజుస్ కంచర్ల నటిస్తున్న ఈ సినిమా… ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి… ఈ సినిమాతో పాయల్ మరో విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.
[youtube_video videoid=ecFWQHkti_Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: