గత ఏడాది ఆరంభంలో విడుదలైన `ఛలో` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఆ తరువాత `గీత గోవిందం`సినిమాలో గీత పాత్రలో ఒదిగిపోయి… యువతరానికి మరింత దగ్గరైంది. ప్రస్తుతం… `గీత గోవిందం` కథానాయకుడు విజయ్ దేవరకొండతో కలసి `డియర్ కామ్రేడ్`లో నటిస్తున్న రష్మిక… అతి త్వరలో పట్టాలెక్కనున్న నితిన్ `భీష్మ`లోనూ నాయికగా కనిపించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ తమిళ చిత్రానికి సంతకం చేసిందని కోలీవుడ్ టాక్. యువ కథానాయకుడు కార్తి హీరోగా `రెమో` ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందనున్న ప్రాజెక్ట్‌లో కథానాయికగా నటించేందుకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. కన్నడ, తెలుగు పరిశ్రమల్లో తనదైన ముద్రవేసిన రష్మిక… తమిళనాట కూడా రాణిస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=RfTNwFP6GeA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: