యువ కథానాయకుడు నాగచైతన్య… ఇటీవలే `మజిలీ` చిత్రాన్ని పూర్తి చేశాడు. ఈ రోజు (ఆదివారం) నుంచి కొత్త చిత్రం `వెంకీ మామ` షూటింగ్‌తో బిజీ కానున్నాడు. ఈ సినిమాలో తన మేనమామ విక్టరీ వెంకటేష్‌తో సందడి చేయనున్నాడు చైతూ. అలాగే అతనికి జోడీగా రాశీ ఖన్నా నటించనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే… అటు వెంకీ, ఇటు రాశి… ఇద్దరూ కూడా ఇంతకుముందు చైతూ సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో కనిపించి సదరు అక్కినేని యంగ్ హీరోకి కలిసొచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అక్కినేని వారి మెమరబుల్ మూవీ `మనం`లో రాశీ ఖన్నా అతిథి పాత్రలో మెరవగా… చైతూ మరో హిట్ మూవీ `ప్రేమమ్`లో వెంకీ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. మరి… అతిథులుగా కలిసొచ్చిన వెంకీ, రాశి… మరోసారి చైతూకి సెంటిమెంట్ పరంగా అచ్చొస్తారేమో చూడాలి. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న `వెంకీ మామ`… ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది.
[youtube_video videoid=a8jLt8-NJCI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: