
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 102


మహేష్ బాబుపై జీఎస్టీ కమిషనరేట్ ప్రశంసలు

సూపర్ డీలక్స్ ట్రైలర్ రిలీజ్

ప్రభుదేవ కృష్ణ మనోహర్ ఐపీఎస్ మూవీ టీజర్ రిలీజ్

4 లెటర్స్ మూవీ మౌత్ టాక్

`15-18-24 లవ్ స్టోరీ` టైటిల్ లోగో ఆవిష్కరణ

అంజలి సి.బి.ఐ మౌత్ టాక్

శతాధిక చిత్ర దర్శక శిఖరం కోడి రామకృష్ణ ఇక లేరు

వెంకీమామ ఫస్ట్ షెడ్యూల్ అప్ డేట్

దేవిశ్రీ... మరోసారి కలిసొస్తాడా?

నాగ్ బాటలోనే చైతూ వెళతాడా?

మామా అల్లుళ్ళతో మరోసారి...?

వారం గ్యాప్‌లో వస్తున్న సమంత

షూటింగ్ పూర్తి చేసుకున్న మజిలీ

మైనపు ప్రతిమ ఆవిష్కరణ డేట్ ఫిక్స్

ప్రొడక్షన్ హౌస్ పై క్లారిటీ ఇచ్చిన చందమామ

ఎన్టీఆర్ మహానాయకుడు మూవీ పబ్లిక్ టాక్

లేటెస్ట్ మూవీస్ కలెక్షన్స్
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడు ఈరోజు ప్రేక్షకుల ముందకు వచ్చింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పార్ట్ అందరికీ నచ్చి మంచి టాక్ ను సంపాదించుకుంది. ఇక ఎన్టీఆర్ మహానాయకుడితో పాటు ఈరోజు పలు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఆ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి జోడీగా అనుపమ పరమేశ్వరన్?
తమిళంలో విజయం సాధించిన `రాచ్చసన్` చిత్రాన్ని... తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని `రైడ్` ఫేమ్ రమేష్ వర్మ రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్‌ని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా వంటి ప్రముఖ కథానాయికల పేర్లు వినిపించినా... ఇప్పుడా అవకాశం అనుపమకి దక్కిందని టాలీవుడ్ టాక్. త్వరలోనే అనుపమ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.

మహేష్ బాబుపై జీఎస్టీ కమిషనరేట్ ప్రశంసలు
నటనలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా శభాష్ అనిపించుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పుడు జీఎస్టీ అధికారులు మహేష్ బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా ప్రేక్షకుల నుంచి జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ.35.66 లక్షలను ‘వినియోగదారుల సంక్షేమనిధి’కి చెల్లించాడు మహేష్ బాబు. దీంతో మహేష్‌బాబును జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ ప్రశంసించింది.

సూపర్ డీలక్స్ ట్రైలర్ రిలీజ్
ప్రముఖ హీరో విజయ్ సేతుపతి, సమంత, ఫాహద్ ఫాజిల్, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా సూపర్ డీలక్స్. టి. కుమార రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేసుకుంది. తమిళంలో ఈ సినిమాను అదే పేరుతో మార్చి 29వ తేదీన విడుదల చేయనున్నారు.

ప్రభుదేవ కృష్ణ మనోహర్ ఐపీఎస్ మూవీ టీజర్ రిలీజ్
ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరుపొందిన ప్రభుదేవ కేవలం డ్యాన్సర్ గా మాత్రమే కాదు.. నటుడు, దర్శకుడు మరియు నిర్మాతగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల ప్రభుదేవ కొరియోగ్రఫి చేసిన రౌడి బేబి ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 200 మిలయన్ల పైన వ్యూస్ వచ్చాయి. దీంతో మరోసారి ప్రభుదేవ సత్తా ఏంటో చూపించారు. అటు కొరియోగ్రఫి చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

4 లెటర్స్ మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

`15-18-24 లవ్ స్టోరీ` టైటిల్ లోగో ఆవిష్కరణ
నిఖిలేశ్వర్, సాహితి, కీర్తన్, సిమ్రాన్ సానియా, ఉపేంద్రా, పారుల్ బిందల్ , ఈషా ,ధన్య శ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం `15-18-24 లవ్ స్టోరీ`. డైరెక్టర్ కిరణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను విమాలాద్రి క్రియేషన్స్, మాజేటి మూవీ మేకర్స్ , కిరణ్ టాకీస్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ లోగో ను ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఆవిష్కరించారు. ఫైట్ మాస్టర్ విజయ్ వారసుడు రాహుల్ విజయ్ - సంతోషం అధినేత సురేష్ కొండేటి సంయుక్తంగా లోగోని ఆవిష్కరించారు.

అంజలి సి.బి.ఐ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

విక్రమ్ సినిమా మిస్ అయినా... అతని కొడుకు సినిమా దక్కింది
`లీడర్` (2010) చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ముద్దుగుమ్మ ప్రియా ఆనంద్. ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ... తెలుగునాట అంతగా రాణించలేకపోయింది ఈ అమ్మడు. అయితే... తమిళంలో మాత్రం ప్రియకి మంచి అవకాశాలే దక్కాయి. అలాగే హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ హిట్ చిత్రాల్లో సందడి చేసింది.

శతాధిక చిత్ర దర్శక శిఖరం కోడి రామకృష్ణ ఇక లేరు
మరో శతాధిక చిత్ర దర్శక శిఖరం కూలిపోయింది. తన గురువు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు తరువాత శతాధిక చిత్ర దర్శకుడిగా పేరుపొందిన సుప్రసిద్ధ దర్శకుడు కోడి రామకృష్ణ ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ లో కనుమూశారు.

వెంకీమామ ఫస్ట్ షెడ్యూల్ అప్ డేట్
విక్టరీ వెంకటేష్ తన ముద్దుల మేనల్లుడు నాగచైతన్యతో కలిసి మరో మల్టీస్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. బాబి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈసినిమా త్వరలోనే పట్టాలెక్కనున్నదని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ వార్తలన్నింటికీ బ్రేక్ వేసి ఓ క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అప్ డేట్ ఇచ్చింది. వెంకీ మామ ఫస్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 24 వ తేదీ నుండి జరుపుకోనున్నట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

దేవిశ్రీ... మరోసారి కలిసొస్తాడా?
యువ కథానాయకుడు రాజ్ తరుణ్ కెరీర్‌లో బెస్ట్ హిట్‌గా నిలచిన చిత్రం `కుమారి 21 ఎఫ్`. కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా... మ్యూజికల్‌గానూ మెప్పించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు... సదరు రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి మేజర్ ప్లస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో... ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందని ఫిల్మ్‌నగర్ టాక్.

నాగ్ బాటలోనే చైతూ వెళతాడా?
`అన్నమయ్య`... కింగ్ నాగార్జున కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రం. ఈ సినిమా తరువాత మళ్ళీ నాగ్ ఖాతాలో సాలిడ్ హిట్ పడేసరికి మూడేళ్ళు పట్టింది. `నువ్వు వస్తావని` రూపంలో మళ్ళీ నాగ్‌కి మరో మరపురాని విజయం దక్కింది. 2000 ఏప్రిల్ 5న ఆ సినిమా విడుదలైంది.

మామా అల్లుళ్ళతో మరోసారి...?
నిజజీవితంలో మేనమామ, మేనల్లుళ్ళు అయిన విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య... `వెంకీ మామ` సినిమా కోసం తెరజీవితంలోనూ అవే పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారంలోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు.

వారం గ్యాప్‌లో వస్తున్న సమంత
గత ఏడాది తెలుగునాట సమంత హవా ఓ స్థాయిలో సాగింది. `రంగస్థలం`, `మహానటి`, `అభిమన్యుడు`, `యూ టర్న్`... ఇలా సామ్ నటించిన ప్రతీ సినిమా తనకి మంచి పేరుని, విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో... ఈ ఏడాది కూడా అదే జోష్‌ని కొనసాగించే పనిలో ఉంది ఈ అక్కినేని వారి కోడలు. ఈ వేసవిలో సామ్ ముచ్చటగా మూడు సినిమాలతో సందడి చేయనుంది. ఆ చిత్రాలే `సూపర్ డీలక్స్` (తమిళ్), `మజిలీ`, `బేబి... ఎంత సక్కగున్నావె`.

షూటింగ్ పూర్తి చేసుకున్న మజిలీ
‘ఏ మాయ చేసావే’ ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన రీల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ జంట నాగ చైతన్య, సమంత పెళ్లి తరువాత మరోసారి జంటగా నటిస్తున్నారు. ఈసారి ‘మజిలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ రియల్ లైఫ్ రొమాంటిక్ జంటను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

మైనపు ప్రతిమ ఆవిష్కరణ డేట్ ఫిక్స్
మేడమ్ టుస్సాడ్స్ మైనపు ప్రతిమల మ్యూజియం లు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ మ్యూజియం లలో ప్రపంచ ప్రముఖుల మైనపు విగ్రహాలు కొలువుతీరతాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు ప్రతిమ సింగపూర్ మ్యూజియం లో ఏర్పాటుచేయడానికి నిశ్చ యించారు. మేడమ్ టుస్సాడ్స్ శిల్పులు హైదరాబాద్ వచ్చి మహేష్ బాబు కొలతలు, ఇతర వివరాలు తీసుకున్నారు. జుట్టు, కంటి కలర్ తో సహా ఒరిజినల్ మహేష్ బాబు లా మైనపు ప్రతిమను సింగపూర్ లో రూపొందించారు.

ప్రొడక్షన్ హౌస్ పై క్లారిటీ ఇచ్చిన చందమామ
అందం, అభినయం ఈ రెండూ ఉంటే చాలు హీరోయిన్ గా రాణించొచ్చు. అలా ఆ రెండు క్వాలిటీస్ ఉన్న టాప్ హీరోయిన్ కాజల్ అని చెప్పడంలోనూ ఎలాంటి సందేహం లేదు. మూడు పదుల వయసులో కూడా ఈ భామ ఇంకా తన అందంతో, అభినయంతో వరుస చిత్రాలు చేసుకుంటూ.. తన తోటి హీరోయిన్స్ కే కాదు.. ఈ నాటి కొత్త హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో..షూటింగ్ లతో బిజీ బిజీగా గడుపుతోంది.

ఎన్టీఆర్ మహానాయకుడు మూవీ పబ్లిక్ టాక్
#NTRMahanayakudu is a clean & emotional political journey of the Legend 'NTR' with beautiful touching family emotions !! Balayya & @RanaDaggubati magic worked…

ఆర్నెల్ల చరిత్రకే పరిమితమైన అసంపూర్ణ జీవిత చరిత్ర ఎన్టీఆర్- మహానాయకుడు
ఇక దర్శకుడు 'క్రిష్' విషయానికి వస్తే ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా తీయాలి అనే రాంగ్ డిసిషన్ ఎవరిదైనప్పటికీ దర్శకుడిగా తన క్రియేటివ్ ఎనర్జీ మొత్తాన్ని తొలి భాగమే లాగేయడంతో క్రిష్ క్రియేటివిటీ రెండవ భాగంలో పెద్దంతగా కనిపించలేదు. తన కష్టం, శ్రమ, డెడికేషన్ అన్నీ కనిపించాయి గానీ తన 'మార్క్' మాత్రం మిస్ అయింది.ఇక టెక్నికల్ గా, సంగీతపరంగా, మేకింగ్ వాల్యూస్ పరంగా మంచి ప్రమాణాలతో రూపొందిన "ఎన్టీఆర్-మహానాయకుడు" ఒక సినిమాగా బాగున్నప్పటికీ ఒక మహా నాయకుడు జీవిత చరిత్రగా మాత్రం అసంపూర్ణము- అసమగ్రము అని చెప్పక తప్పదు.