మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ దర్శకత్వం లో నాని హీరోగా కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఇటీవలే లాంఛనంగా ప్రారంభించగా రేపటి నుండి రెగ్యూలర్ గా షూటింగ్ జరుపుకోనుంది. ఇదిలా ఉండంగా ఈ సినిమా టైటిల్ ను ఇప్పటివరకూ ప్రకటించని చిత్రయూనిట్ దానికి కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం 5 గంటలకు విక్రమ్-నానిల కొత్త సినిమా టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో నాని సరసన నటించే కథానాయికల సంఖ్య పెద్దగానే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే పలువురి పేర్లు వినిపించినా ఎవరెవరు నటిస్తున్నారో మాత్రం అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు. ఇంకా సూపర్ హిట్ RX 100 మూవీ హీరో కార్తికేయ కూడా ఈ సినిమాలో నటించనున్నాడు. అది కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ కి అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు.
కాగా ప్రస్తుతం నాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెర్సీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే.. ఈసినిమాను కూడా పట్టాలెక్కించేస్తున్నారు. మరి జెర్సీ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది.. ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో చూద్దాం…!
[youtube_video videoid=bjl-gISLXzQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: