కుటుంబ కథా చిత్రం ‘పెళ్ళాం చెపితే వినాలి’కి 28 ఏళ్ళు

Director Kodi Ramakrishna Wholesome Family Entertainer Pellam Chepithe Vinali Completes 28 Years

అగ్రశ్రేణి దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన పలు కుటుంబ కథా చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘పెళ్ళాం చెపితే వినాలి’ ఒకటి. హరీష్, మీనా జంటగా నటించిన ఈ ఫ్యామిలీ డ్రామాలో శ్రీకాంత్, కాస్ట్యూమ్ కృష్ణ, గిరిబాబు, శివాజీరాజా, వై.విజయ, సాగరిక, కోవై సరళ, రాజీవి, బాబుమోహన్ ముఖ్య పాత్రలు పోషించగా మురళీమోహన్ ప్రత్యేక పాత్రలో దర్శనమిచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి స్వరకర్త చక్రవర్తి బాణీలు అందించగా జొన్నవిత్తుల, గణేష్‌పాత్రో సాహిత్యం స‌మ‌కూర్చారు. “పెళ్ళాం చెప్తే వినాలి”(టైటిల్ సాంగ్), “దీవెనలిచ్చె శ్రావణలక్ష్మి”, “మొగుడు చెప్తే వినాలి”, “టీనేజి సోకు అదిరింది”, “పగలు వేరు రాత్రి వేరు”.. ఇలా ప్ర‌తీ పాట అప్పటి ప్రేక్షకులను అలరించింది. మురళీమోహన్ సమర్పణలో శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై విజయలక్ష్మి మాగంటి, పద్మజవాణి దుగ్గిరాల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. 1992 మే 15న విడుదలై కుటుంబ ప్రేక్షకుల మన్ననలు పొందిన ‘పెళ్ళాం చెపితే వినాలి’.. నేటితో 28 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here