కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నా..వీర జవానుల కథలు నాకు పంపండి..!

Manchu Vishnu Urges Everyone To Share Stories and Photos Of Soldiers Of Indian Army
Manchu Vishnu Urges Everyone To Share Stories and Photos Of Soldiers Of Indian Army

సోషల్ మీడియాలో మంచు విష్ణు కాస్త యాక్టీవ్ గానే ఉంటాడు. తన సినిమాలకు సంబందించే కాదు అప్పుడప్పుడు సమాజంలోని విషయాలపై కూడా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియచేస్తుంటాడు. ఇక ఇప్పుడు తాజాగా జన్మనిచ్చిన తల్లి, వీర జవానులు, రైతుల గొప్పతనం గురించి తెలుపుతూ ఒక వీడియోను పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

”ఈ రోజు నా మనసులో ఉన్న మాట మీతో చెప్పాలని మీ ముందుకొచ్చాను. ప్రపంచంలో నిత్యం మనము శిరస్సు వంచి నమస్కరించాల్సిన వాళ్ళు ముగ్గురు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, మన ఆకలి తీర్చే రైతన్న, తన కుటుంబానికి దూరమై మన భద్రత కోసం కాపలా కాసే వీర జవాన్. ఈ ముగ్గురికీ లభించవలసిన గుర్తింపు లభించడం లేదని నా భావన. నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శనీయమైన కన్న తల్లుల్ని, కష్ట జీవులైన రైతులను కలిసే అదృష్టం నాకు కలిగింది. కానీ వీర జవానులను కలిసే అదృష్టం కలగలేదు. అందుకే ఇప్పుడు భారత్ ఆర్మీ ఫోర్స్ గురించి తెలుసుకునే కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నా. ప్రపంచంలో ఎంతో సమర్ధవంతమైన భారత్ ఆర్మీ ఫోర్స్‌లో అడుగుపెట్టి తమదైన ముద్ర వేసిన తెలుగు వీర జవానుల గురించి తెలుసుకోబోతున్నాను. మీలో ఎవరి దగ్గరైనా మన తెలుగు వీర జవానుల త్యాగాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, పేర్లు ఉంటే నా ట్విటర్ ఖాతాకు పంపించాల్సిందిగా కోరుతున్నా. ప్రపంచంతో వాళ్ళ వీర కథలను పంచుకుందాం. జై జవాన్.. జై కిసాన్.. జై హింద్” అన్నారు.


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.