చిన్న సినిమాల ప్లానింగ్ లో విష్ణు మంచు

Manchu Vishnu Plans To Make Short Films Post Lock down

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు “విష్ణు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ఢీ “, “దేనికైనా రెడీ “, “దూసుకెళ్తా ” , “ఈడో రకం ఆడో రకం”, “లక్కున్నోడు “, “ఆచారి అమెరికా యాత్ర ” వంటి కామెడీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి , ఆ బ్యానర్ పై “దేనికైనా రెడీ” , “దూసుకెళ్తా” , “పాండవులు పాండవులు తుమ్మెద” , “కరెంట్ తీగ” , “సింగం 123” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విష్ణు మంచు ప్రస్తుతం 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై తెలుగు , ఇంగ్లీష్ భాషలలో ప్రపంచ అతి పెద్ద ఐ టి స్కామ్ నేపథ్యంలో రూపొందుతున్న “మోసగాళ్ళు ” మూవీ లో నటిస్తూ , నిర్మిస్తున్నారు. ఇప్పుడు విష్ణు 4 చిన్న సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేశారు. ఈ నాలుగు సినిమాలకు కథలు సిద్ధం అయ్యాయి, డైరెక్టర్స్ కూడా ఫిక్స్ అయ్యారు. వీటిలో ఒక సినిమాలో కమెడియన్ ప్రియదర్శి హీరోగా నటిస్తారని , మిగతా మూడు సినిమాలు కొత్త వారితో రూపొందనున్నాయని సమాచారం. ఈ సినిమాలను పరిమిత బడ్జెట్, చక్కని ప్లానింగ్ తో రూపొందించాలని విష్ణు ప్లాన్ చేశారు. లాక్ డౌన్ సమయం ముగిసిన తరువాత ఈ నాలుగు సినిమాలు ప్రకటించి విష్ణు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fifteen =