ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూసేది ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఇంట్రడక్షన్ వీడియో కోసం. రామ్ చరణ్ పుట్టిన రోజు చరణ్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనితో తమ హీరో వీడియో ఏ రేంజ్ లో ఉంటదా అని ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో ఉండకపోవచ్చని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే అది నిజం కాదని, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ఇప్పటికే సిద్ధం అయ్యిందని టాక్. ఇప్పటికే ఈ వీడియోను సిద్ధం చేశారట. ఎన్టీఆర్ లుక్, డైలాగ్స్ తో పాటు యాక్షన్ మూమెంట్స్ అదుర్స్ అట. టీమ్ అంతా కూడా ఈ వీడియో పట్ల సంతృప్తికరంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు ఆశించిన స్థాయిలో ఈ వీడియో ఉంటుందని సమాచారం. మరి రాజమౌళి సినిమా కాబట్టి ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.
ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: