చిరంజీవి, రాధిక సెన్సేష‌న‌ల్ మూవీ ‘న్యాయం కావాలి’కి 39 ఏళ్ళు

Mega Star Chiranjeevi and Radhika Sensational Movie Nyayam Kavali Completes 39 Years

మెగాస్టార్ చిరంజీవి, అగ్రశ్రేణి దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో దాదాపు 23 చిత్రాలు తెరకెక్కగా వాటిలో సింహభాగం ఘనవిజయాలు సాధించినవే కావడం విశేషం. అలాంటి బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ‘న్యాయం కావాలి’. “ప్రేమ పేరుతో మోసపోయిన అమ్మాయి.. మోసం చేసిన అబ్బాయిపై చేసిన న్యాయపోరాటంలో ఎటువంటి విజయాన్ని సాధించింది?” అనే క‌థాంశంతో ‘న్యాయం కావాలి’ రూపొందింది. నవలా రచయిత్రి డి.కామేశ్వరి రచించిన ‘కొత్తమలుపు’ నవలాధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు దర్శకుడు కోదండ‌రామిరెడ్డి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిరంజీవికి జోడిగా నటించిన రాధికని నటశిఖరాగ్రాన నిలబెట్టిందీ సినిమా. అంతేకాదు.. తెలుగునాట కథానాయికగా పరిచయమైన తొలి చిత్రంతోనే ప్రేక్షకులను తన అభిన‌యంతో కట్టిపడేసింది రాధిక. శారద ప్ర‌ధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో జగ్గయ్య, చాట్ల శ్రీరాములు, పుష్పలత, ‘అత్తిలి’ లక్ష్మి, హలం, బేబీ రోహిణి, బేబీ తులసి కీల‌క పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. “ఫటాఫట్” జయలక్ష్మి, అల్లు రామలింగయ్య అతిథి పాత్రల్లో మెరిసారు.

వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. “లవ్ యు భారతి”, “ఈ రోజే ఆదివారము”, “న్యాయం కావాలి”(టైటిల్ సాంగ్), “బిడి బిడి బిడియంగా”, “అమ్మో నాకు భయం”.. ఇలా ఇందులోని ప్రతీ పాట అప్పట్లో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంతో ‘ఉత్తమ నటి’ విభాగంలో ‘ఫిలింఫేర్‌’ను సొంతం చేసుకుంది రాధిక. శ్రీ క్రాంతి చిత్ర పతాకంపై క్రాంతికుమార్ నిర్మించిన ఈ సినిమా.. హిందీ(‘ముజ్హే ఇన్సాఫ్ చాహియే’), కన్నడ(‘కేరలిద హెన్ను’), తమిళ(‘విధి’), మ‌ల‌యాళం (‘తాళం తేట్రియ తారాత్తు’) భాషల్లో పునర్నిర్మితమైంది. 1981 మే 15న విడుదలై విశేషాదరణ పొందిన ‘న్యాయం కావాలి’.. నేటితో 39 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 10 =