‘RRR’ రిలీజ్ అప్పుడే ఉండొచ్చు ..!

SS Rajamouli Magnam Opus RRR To Hit Theatres In 2021 April
SS Rajamouli Magnam Opus RRR To Hit Theatres In 2021 April

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది జులై లో రిలీజ్ అవ్వాలి కానీ షూటింగ్ అవ్వక.. ఇంకా చాలా పనులు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ కాస్త వాయిదా పడింది. అయితే వచ్చే ఏడాది 2021 జనవరిలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అయితే కరోనా వల్ల అది కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చాలా న్యూస్ కూడా వచ్చాయి. జనవరి రిలీజ్ అవ్వడం కష్టమే అని. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నిర్మాత దానయ్య కూడా రిలీజ్ డేట్ పై మాట్లాడారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన దానయ్య జనవరి లో రిలీజ్ అవ్వడం చాలా కష్టంగానే వుంది.. ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తయింది.. ప్రభుత్వం కనుక అనుమతి ఇస్తే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతాం… ఇంకా వీఎఫ్ క్స్ పనులు అవ్వడానికి కూడా బాగానే టైం పడుతుంది.. కాబట్టి ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 4 =