సూపర్ హిట్ “ఏమైంది ఈ వేళ ” మూవీ తో సంపత్ నంది దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. రైటర్, డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన “రచ్చ “,”బెంగాల్ టైగర్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన యాక్షన్ మూవీ “గౌతమ్ నంద” నిరాశ పరిచింది. సంపత్ నంది ప్రస్తుతం గోపీచంద్, తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్” మూవీ రూపొందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లేటెస్ట్ ఇంటర్వ్యూ లో సంపత్ నంది మాట్లాడుతూ .. కరోనా వైరస్ ప్రభావంతో సాంఘిక జీవనం తో పాటు చిత్ర సీమ లో కూడా గణనీయ మార్పులు చోటు చేసుకోబోతున్నాయని, సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత సానుకూల పరిస్థితులు చూస్తామని, లాక్ డౌన్ గురించి మాట్లాడుతూ రైటర్, డైరెక్టర్ గా బిజీగా ఉండటం తో ఫ్యామిలీ కి సమయం కేటాయించడం కుదిరేది కాదని, ఇప్పుడు ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నానని, కరోనా తరువాత మానవీయ కోణం లో చిత్రాలు రూపొందే అవకాశం ఉందని, మెగా స్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా చేయాలని తన చిరకాల కోరిక అని, తెలంగాణ రజాకార్ల నేపథ్యం లో ఒక స్క్రిప్ట్ రెడీచేస్తున్నానని, స్క్రిప్ట్ రెడీ అయిన తరువాత చిరంజీవిని కలుస్తానని సంపత్ నంది చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: