‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్న సంగతి తెలిసిందే. రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నాడట. రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర సాగుతుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య విలన్ గా హీరో శ్రీకాంత్ ను తీసుకున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. తాజా సమాచారం ప్రకారం శ్రీకాంత్ కాకుండా మరో విలన్ కూడా ఉంటాడట. ఆ విలన్ ను బాలీవుడ్ నుంచి తీసుకురానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణకి .. బాలీవుడ్ విలన్ కి మధ్య భారీ యాక్షన్ సీన్స్ .. చేజింగ్స్ వుంటాయని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. చూద్దాం మరి ఆ విలన్ ఎవరో..
ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: