తల్లి పాత్రలో హీరోయిన్ సిమ్రాన్ ?

Actress Simran To Play Mother For Raj Tarun In His Upcoming Movie

1997 సంవత్సరం లో టాలీవుడ్, కోలీవుడ్ లలో ప్రవేశించిన సిమ్రాన్ పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “సమర సింహా రెడ్డి”, “కలిసుందాం రా “, “నువ్వు వస్తావని”, నరసింహ నాయుడు “, సీతయ్య ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “జాన్ అప్పారావు 40ప్లస్ “(2008 ) మూవీ తరువాత తెలుగు మూవీస్ లో సిమ్రాన్ నటించ లేదు. తెలుగు, తమిళ మూవీస్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన సిమ్రాన్ ప్రస్తుతం తమిళ మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. సిమ్రాన్ ఇప్పుడు ఒక తెలుగు మూవీ లో తల్లి పాత్రలో నటించనున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ నదియా, మీనా , మధుబాల తల్లి పాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సిమ్రాన్ కూడా తల్లి పాత్రలో నటించనున్నారని సమాచారం. నూతన దర్శకుడు సంతోష్ మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఒక మూవీ రూపొందనుంది. స్టాండప్ కమెడియన్ గా రాజ్ తరుణ్ నటిస్తున్న ఈ మూవీ లో హీరో తల్లి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటం తో ఆ పాత్రకు సిమ్రాన్ ను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ మూవీ ని సిమ్రాన్ ఓకే చేస్తే 12 సంవత్సరాల తరువాత టాలీవుడ్ కు రీ ఎంట్రీ మూవీ అవుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =