ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటీమణుల్లో కేరళకుట్టి నిత్యా మీనన్ ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ.. ఇలా పలు భాషల్లో నటిగా తనదైన ముద్ర వేసిన నిత్య.. త్వరలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీతో సందడి చేయనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్ ఇదివరకెన్నడూ పోషించని పాత్రలో కనిపిస్తుందని టాక్. లాక్ డౌన్ పిరియడ్ అనంతరం ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని వినికిడి. అంతేకాదు.. ఈ సినిమాని దక్షిణాదిలోని నాలుగు భాషలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడతో పాటు హిందీలోనూ ఏకకాలంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
మరి.. ఈ మల్టీలింగ్వల్ మూవీతో మల్టీ టాలెంటెడ్ బ్యూటీ నిత్యా మీనన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: