నీ మరణం నన్ను కలిచివేసింది..!

Sensational Director Shankar Mourns The Demise Of His Assistant Director Arun Prasath
Sensational Director Shankar Mourns The Demise Of His Assistant Director Arun Prasath

తమిళ్ నాడు యువ దర్శకుడు అరుణ్‌ ప్రసాత్‌ ఈ రోజు ప్రమాదంలో మృతిచెందారు. బైక్‌పై వెళ్తున్న అరుణ్‌ను.. లారీ ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు విడిచారు. కోయంబత్తూరులోని మెట్టుపాలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈయన ప్రముఖ దర్శకుడు శంకర్‌ వద్ద అసిస్టెంట్‌గా అనేక సినిమాలకు పనిచేశాడు‌. పలువురు తమిళ సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అరుణ్ మరణంపై శంకర్ స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. యువదర్శకుడు, తన మాజీ అసిస్టెంట్‌ అరుణ్‌ ఆకస్మిక మరణం.. తనను కలిచివేసిందని.. అరుణ్‌ మృదు స్వభావి అని, పాజిటివ్‌ థింకింగ్‌తో కష్టపడుతూ ముందుకు సాగేవాడని గుర్తుచేసుకున్నారు. అరుణ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కాగా జీవీ ప్రకాష్‌ కుమార్‌, గాయత్రి సురేష్‌, సురేష్‌ మీనన్‌, సతీష్‌ ముఖ్య పాత్రల్లో 4 జీ అనే సినిమాతో అరుణ్ దర్శకుడిగా మారాడు. కానీ ఆ సినిమా విడుదల కాలేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 4 =