లాక్ డౌన్ ఒక కొత్త అనుభవం – రమ్యకృష్ణ

Ramya Krishna about Lockdown

దక్షిణాది భాషా చిత్రాలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ “కంటే కూతుర్నే కను ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ “పడయప్పా ” మూవీ లో హీరో రజనీకాంత్ కు ధీటుగా రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు తెలుగు, తమిళ మూవీస్ లో నటించి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “బాహుబలి ” మూవీ లో శివగామి గా నటించిన రమ్యకృష్ణ పలు అవకాశాలు అందుకుంటున్నారు. రమ్యకృష్ణ ప్రస్తుతం “రంగ మార్తాండ”, “ఫైటర్ “, సాయి తేజ్ మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ .. లాక్ డౌన్ అనేది జీవితంలో ఒక కొత్త అనుభవం అని, ఇంతటి ఖాళీ సమయం , ఏకాంతం ఎప్పుడూ దొరకలేదని, లాక్ డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నానని, “క్వీన్ ” వెబ్ సిరీస్ సీజన్ 2 , ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ , 2హిందీ ప్రాజెక్ట్స్ ఉన్నాయని లాక్ డౌన్ పూర్తి అయిన తరువాత ఈ టైమ్ మెమొరబుల్ గా ఉంటుందని, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తాను నటించిన లెజెండరీ యాక్ట్రెస్, పొలిటికల్ లీడర్ జయలలిత బయోపిక్ వెబ్ సిరీస్ “క్వీన్ ” తెలుగు వెర్షన్ జీ తెలుగు ఛానల్ లో సోమవారం నుండి ప్రసారం కానుండటం తో ఆనందంగా ఉందని రమ్యకృష్ణ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.