ఇన్నోవేటివ్ థాట్స్‌కి కేరాఫ్ అడ్రస్.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్. తన మొదటి సినిమా `ఆర్య` నుంచి గత చిత్రం ‘రంగస్థలం’ వరకు నవ్యతకే పెద్ద పీట వేశాడు సుక్కు. ప్రస్తుతం తన లక్కీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా ‘పుష్ప’ను తెరకెక్కిస్తున్నాడీ టాలెంటెడ్ డైరెక్టర్. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. లాక్ డౌన్ అనంతరం మలి దశ చిత్రీకరణ జరుపుకోనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని తనకి అచ్చొచ్చిన సీజన్‌లోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట సుక్కు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. సుకుమార్ ట్రాక్ రికార్డుని పరిశీలిస్తే ఓ విషయం స్పష్టం. అదేమిటంటే.. సమ్మర్ సీజన్‌లో సుక్కు నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. ఇప్పటిదాకా సుకుమార్ 7 సినిమాలకు దర్శకత్వం వహించగా.. వాటిలో 3 చిత్రాలు ‘ఆర్య’(2004), ‘100% లవ్’(2011), ‘రంగస్థలం’(2018) సమ్మర్‌లోనే రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ క్రమంలోనే.. ‘పుష్ప’ని కూడా సమ్మర్ సీజన్‌నే టార్గెట్ చేస్తూ విడుదల చేస్తున్నారనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మరి.. ఇప్పటికే ‘ఆర్య’, ‘100% లవ్’, ‘రంగస్థలం’ చిత్రాలతో వేసవి వేదికగా హ్యాట్రిక్‌ను అందుకున్న సుక్కు.. ‘పుష్ప’తో కూడా ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: