“తలైవి “మూవీ లో కీలక పాత్రలో భాగ్యశ్రీ

Actress Bhagya Sree To Play A Pivotal Role In Kangana Ranaut Biopic Movie Thalaivi

విబ్రి మీడియా, కర్మ మీడియా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో లెజెండరీ యాక్ట్రెస్, పొలిటికల్ లీడర్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా “తలైవి ” తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జయలలిత సినీ, రాజకీయ జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలితగా నటిస్తున్నారు. అరవింద్ స్వామి, ప్రకాష్ రాజ్, పూర్ణ, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్, రచిత అరోరా సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “మైనే ప్యార్ కియా ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన భాగ్యశ్రీ కన్నడ, తెలుగు, మరాఠీ, భోజపురి, బెంగాల్ భాషా చిత్రాలలో నటించారు. ప్రస్తుతం #Prabhas 20 మూవీ లో నటిస్తున్న భాగ్యశ్రీ ఇప్పుడు “తలైవి “మూవీ లో కీలక పాత్ర కై ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా భాగ్యశ్రీ మాట్లాడుతూ .. తలైవి లైఫ్ టర్నింగ్ పాయింట్ చేసే కీలక పాత్రలో నటిస్తున్నానని, కంగనా కు తనకు మధ్య చాల సీన్స్ ఉన్నాయని, మా ఇద్దరి మధ్య ఉన్న ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ని చిత్ర యూనిట్ ప్రశంసించారని, కంగనా ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అని, బెస్ట్ పెర్ఫార్మెన్స్ కై శ్రమిస్తుందని భాగ్యశ్రీ చెప్పారు. “తలైవి “మూవీ తమిళ భాష తోపాటు తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − two =