శోభన్‌బాబు, వాణిశ్రీ ‘జీవనజ్యోతి’కి 45 ఏళ్ళు

45 Years for Sobhan Babu's Jeevanajyothi

నటభూషణ్ శోభన్‌బాబు, క‌ళాభినేత్రి వాణిశ్రీ.. టాలీవుడ్ ఎవ‌ర్‌గ్రీన్ హిట్ పెయిర్. వీరిద్దరు జంటగా నటించిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘జీవనజ్యోతి’ ఒకటి. “కళాతపస్వి” కె.విశ్వనాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘నిండు హృదయాలు’, ‘చిన్ననాటి స్నేహితులు’, ‘చెల్లెలి కాపురం’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత కె.విశ్వనాథ్‌, శోభన్‌బాబు, వాణిశ్రీ కలయికలో వచ్చిన ‘జీవనజ్యోతి’ కూడా అదే బాట పట్టడం విశేషం. ఇందులో వాణిశ్రీ తల్లీకూతుళ్ళుగా ద్విపాత్రాభినయం పోషించ‌గా కైకాల సత్యనారాయణ, రాజబాబు, అల్లు రామలింగయ్య, భీమరాజు, ముక్కామల, శుభ, రమాప్రభ, నిర్మల, బేబీ వరలక్ష్మి ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డా.సి.నారాయణ రెడ్డి, కొసరాజు గీతరచనకు దిగ్గజ స్వరకర్త కె.వి.మహ‌దేవన్ వీనులవిందైన బాణీలు అందించారు. “ముద్దుల మా బాబు”(రెండు వెర్ష‌న్స్‌), “సిన్ని ఓ సిన్ని”, “ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో”, “ఎందుకంటే ఏమి చెప్పను”, “ఎవరనుకున్నావు రా”, “దెబ్బకు దెయ్యం వదిలించావు”.. ఇలా ఇందులోని ప్రతీ పాట నిత్యనూతనమే. డి.వి.యస్.ప్రొడక్షన్స్ పతాకంపై డి.వి.యస్.రాజు ఈ సినిమాని నిర్మించారు.

‘ఉత్తమ చిత్రం’ విభాగంలో ‘నంది’ పుర‌స్కారం కైవసం చేసుకున్న ఈ సినిమా.. ‘బెస్ట్ ఫిలిమ్’, ‘బెస్ట్ డైరెక్టర్’(కె.విశ్వనాథ్), ‘బెస్ట్ యాక్టర్’(శోభన్‌బాబు), ‘బెస్ట్ యాక్ట్రెస్’(వాణిశ్రీ) కేటగిరీల్లోనూ ‘ఫిలింఫేర్ – తెలుగు’ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాని ‘సంజోగ్’(1985) పేరుతో హిందీలో పున‌ర్నిర్మితం చేయ‌గా హిందీలోనూ కె.విశ్వనాథ్‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించడం విశేషం. అలాగే, ‘బాళిన జ్యోతి’(1996) టైటిల్‌తో క‌న్న‌డంలో రీమేక్ చేయ‌గా అక్కడ మరో తెలుగు దర్శకుడు క్రాంతికుమార్ రీమేక్ వెర్ష‌న్‌ను డైరెక్ట్ చేయడం విశేషం. 1975 మే 16న విడుదలై ఘనవిజయం సాధించిన ‘జీవనజ్యోతి’.. నేటితో 45 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =