
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 165


హిందీ ఆడియన్స్ కు ప్రశాంత్ వర్మ థ్యాంక్స్

శివకార్తికేయన్ 21 టైటిల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

విశ్వక్ సేన్ బ్యాక్ టు #VS10 సెట్

హరిహర వీరమల్లు టీమ్ సర్ ప్రైజింగ్ అప్ డేట్

రీ రిలీజ్ కానున్న బేబి

హరోం హర ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

హిందీలో హనుమాన్ 50కోట్లు

పుష్ప 2 సెట్ లో సుకుమార్ క్లిక్

ఈగల్ 3డేస్ సాలిడ్ కలెక్షన్స్

గామి మూవీ పై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

ప్రముఖసంస్థకు DNS మూవీ ఓవర్సీస్ రైట్స్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో టాలెంటెడ్ నటుడు ధనుష్ ఇంకా కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ ను కూడా ఇటీవలే మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే. ప్రస్తుతానికి DNS అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ వచ్చింది. ఈసినిమా ఓవర్సీస్ రిలీజ్ రైట్స్ ను ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది. డ్రీమ్జ్ ఎంటర్ టైన్ మెంట్ అనే సంస్థ ఈసినిమా ఓవర్సీస్ రైట్స్ ను సొంతం చేసుకొని అక్కడ రిలీజ్ చేయనుంది. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

సునీత నుండి మెలోడియస్ ఎంత ప్రేమ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలను పాడి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గాయనిగామాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ఎంతో మంది హీరోయిన్లకు తన గాత్రాన్ని అందించారు. ప్రస్తుతం సినిమాల్లో పాటలు పాడుతూనే బుల్లితెరపై వస్తున్న పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కేవలం సినిమా పాటలు మాత్రమే కాదు ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఆమధ్య మనోహరమా అనే పాటను పాడారు. హరితేజ నర్తించిన ఆపాట మెలోడియస్, విజువల్ అట్రాక్షన్ తో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో పాటతో వచ్చేశారు. ఎంత ప్రేమ అనే పాటను తాజాగా…

హిందీ ఆడియన్స్ కు ప్రశాంత్ వర్మ థ్యాంక్స్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి. ఇక కలెక్షన్స్ పరంగా ఈసినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టిస్తుంది. కేవలం 10 రోజుల్లోనే ఈసినిమా 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. అంతేకాదు 92 సంవత్సరాల తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పటివరకూ వచ్చిన తెలుగు సినిమాలలో ఆల్-టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 25 రోజుల్లో 300 కోట్లను కలెక్ట్ చేసింది.

శివకార్తికేయన్ 21 టైటిల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా #SK21 వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఉలగనాయగన్ కమల్ హాసన్ హోం బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో ఇది రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో శివకార్తికేయన్‌కు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది.

విశ్వక్ సేన్ బ్యాక్ టు #VS10 సెట్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం సినిమా జయాపజయాలతో పనిలేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్ ఈ ఏడాది పలు సినిమాలను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. అందులో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా గామి. ఈసినిమాా మార్చి8వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

హరిహర వీరమల్లు టీమ్ సర్ ప్రైజింగ్ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈసినిమా కోసం పవన్ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కొంచం పెండింగ్ లో ఉంది.

ఈగల్ సక్సెస్ మీట్.. హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల పేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈగల్ మేకర్స్ పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ని నిర్వహించారు. కాగా ఈ వేడుకలో బివిఎస్ రవి, మణిబాబు…

రీ రిలీజ్ కానున్న బేబి
గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి కల్ట్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది బేబి.ఈసినిమా 75కోట్ల వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా బయ్యర్ల కు భారీ లాభాలను తీసుకొచ్చింది.ఆనంద్ దేవరకొండ ,వైష్ణవి చైతన్య ,విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈసినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేయగా ఎస్ కె ఎన్ నిర్మించాడు.

ఈ సినిమాతో సందీప్ కిషన్ నెక్స్ట్ రేంజ్‌కి వెళ్తాడు - అనిల్ సుంకర
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది.

ఆపరేషన్ వాలెంటైన్ నుండి రుహానీ శర్మ ఇంట్రో పోస్టర్ రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమాను మార్చి1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే వరుసగా అప్ డేట్లతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను పలు పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా ఈసినిమాలో నటిస్తున్న మరో పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్…

నెట్ ఫ్లిక్స్ లో గుంటూరు కారం హవా
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం గత వారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైయింది.తెలుగు తోపాటు హిందీ,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తుండగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.తెలుగు వెర్షన్ ట్రెండింగ్ లో మొదటి స్థానంలో కొనసాగుతుండగా హిందీ వెర్షన్ మూడో స్థానం లో తమిళ వెర్షన్ ఐదో స్థానంలో కొనసాగుతుంది.దాంతో థియేటర్లలోనే కాదు ఓటిటి లోకూడా ఈసినిమాకు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

హరోం హర ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
మొదటినుండీ సుధీర్ బాబు కూడా కాస్త డిఫరెంట్ సినిమాలే చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుండేవాడు. కొన్ని మంచి విజయం సాధించగా.. కొన్ని మాత్రం పరాజయాలే అందించాయి. అయినా కూడా సుధీర్ బాబు జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరోం హర సినిమా కూడా ఒకటి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

ఊరు పేరు భైరవకోన.. నాకు చాలా స్పెషల్ మూవీ - సందీప్ కిషన్
యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్‌లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.

కాళికాదేవి ఎపిసోడ్‌లో నన్ను నేను నమ్మలేకపోయాను - రవితేజ
మాస్ మహారాజా రవితేజ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై అన్ని వర్గాల పేక్షకులని అలరించి పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈగల్ మేకర్స్ పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ని నిర్వహించారు.

హిందీలో హనుమాన్ 50కోట్లు
హనుమాన్ హిందీలో 50కోట్ల నెట్ మార్క్ ను చేరుకుంది.మొదటి వారం 22.92కోట్లు రెండో వారం 16.67,మూడో వారం 6.47,నాలుగో వారం 3.68 నెట్ వసూళ్లను రాబట్టగా ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చి మూడు రోజుల్లో 1.02కోట్ల నెట్ తో 50.76కోట్ల నెట్ ను ఖాతాలో వేసుకుంది దాంతో హిందీలో అత్యధిక వసూళ్ల రాబట్టిన దక్షిణాది సినిమాల జాబితాలో హనుమాన్ 10వ స్థానాన్నిదక్కించుకుంది.ఈ జాబితాలో బాహుబలి 2,కెజియప్ 2,ఆర్ఆర్ఆర్,రోబో 2.0,సలార్ ,సాహో,బాహుబలి,పుష్ప,కాంతారా వరుస స్థానాల్లో కొనసాగుతున్నాయి.ఇక ఈసినిమాకు సూపర్ రెస్పాన్స్ రావడంతో జై హనుమాన్ కు ప్లస్ అవ్వనుంది.హనుమాన్ కు ఈ సినిమా సీక్వెల్ గా రానుంది దాంతో హిట్ టాక్ వస్తే ఈజీగా…

పుష్ప 2 సెట్ లో సుకుమార్ క్లిక్
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో అల్లు అర్జున్ నుండి వస్తున్న పుష్ప2 సినిమా కూడా ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాను ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదన్న క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇక ఆ దిశగానే షూటింగ్ ను కూడా చాలా స్పీడుగా పూర్తిచేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేస్తున్నారు మేకర్స్. ఇక ఇదిలా ఉండగా తాజాగా షూటింగ్ సెట్ నుండి తీసిన సుకుమార్ క్యాండిడ్ క్లిక్ ను హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేశారు. సింహం విగ్రహం పై కాస్త ఒరిగి ఉన్న…

స్వయంభూ కోసం.. హార్స్ రైడింగ్ నేర్చుకుంటోన్న సంయుక్త మీనన్
టాలీవుడ్ హీరో నిఖిల్ తన 20వ చిత్రంగా 'స్వయంభూ' అనే సోషియో ఫాంటసీగా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన లెజెండరీ యోధుడి పాత్రను పోషించనున్నాడు. ఈ నేపథ్యంలో నిఖిల్ ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అద్భుతమైన వార్ సీక్వెన్సులు ఉండే ఈ సినిమాలో అన్ బిలీవబుల్ స్టంట్స్ చేయడానికి సిద్దమయ్యాడు. ఇక అతనితో పాటు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంయుక్త మీనన్ కూడా కథ ప్రకారం, ఇందులో కొన్ని స్టంట్స్ చేయనుంది.

ఈగల్ 3డేస్ సాలిడ్ కలెక్షన్స్
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన సినిమా ఈగల్. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈసినిమా పోటీ నుండి తప్పుకొని సింగిల్ రిలీజ్ ను ఫిక్స్ చేసుకొని ఫైనల్ గా ఫిబ్రవరి9వ తేదీన రిలీజ్ అయింది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా రవితేజ మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూాడా ఈసినిమా మంచి కలెక్షన్సే రాబట్టుకుంటుంది. మొదటిరోజే ఈసినిమా దాదాపు 12కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఫస్ట్ వీకెండ్ ముగిసింది. ఈ మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 30కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం…

గామి మూవీ పై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాను మొదలుపెట్టి దాదాపు నాలుగేళ్లు అయిపోయింది. ఎంతో కష్టపడి ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి8వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈసినిమా మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసిన సంగతి విదితమే కదా. మేకింగ్ వీడియోకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. కిష్టమైన వాతావరణ పరిస్థితిల్లో ఎలా మేకింగ్…

చరణ్ పై శర్వా ప్రశంసలు-నాకు స్నేహితుడు కావడం గర్వకారణం
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో పేరు సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో…