
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 164


వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఉపాసన స్పెషల్ పోస్ట్

టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్

రామం రాఘవం ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

విశ్వంభరకు చిన్న బ్రేక్ అంటున్న చిరు


సౌత్ మేకర్స్ పై ఇమ్రాన్ హష్మీ ఆసక్తికర కామెంట్స్

ఫుల్ స్వింగ్ లో కంగువ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్

రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో తేజ్

దేవర షూటింగ్ అప్డేట్

గాంజా శంకర్ కు లైన్ క్లియర్

స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న చరణ్

వ్యూహం, శపథం ట్రైలర్ రిలీజ్

భైరవ కోన ప్రీమియర్స్ కు షాకింగ్ రెస్పాన్స్

సూరరై పోట్రు హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్

టిల్లు స్క్వేర్ ట్రైలర్ రెడీ అవుతుంది

రవితేజ కిక్.. రీ రిలీజ్‌కి రెడీ

విజయ్ గోట్.. ఏప్రిల్ కు కంప్లీట్ చేసే ప్లాన్?
దళపతి విజయ్ తన తరువాత సినిమా వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఉపాసన స్పెషల్ పోస్ట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల బుధవారం (ఫిబ్రవరి 14, 2024) ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక మధురమైన పోస్ట్‌ను తన అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్‌ను పెట్టారు. అందులో ఉపాసన, రామ్ చరణ్ మరియు కుమార్తె క్లిన్ కారా చేతులు ఉన్న ఒక స్నాప్‌ను షేర్ చేశారు. దీనికి రెడ్ హార్ట్ ఎమోటికాన్‌ను జోడించిన ఉపాసన, క్యాప్షన్‌లో ఇన్ఫినిటీ సింబల్‌ను పోస్ట్ చేశారు. వాలెంటైన్స్ డే వేళ ఉపాసన పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా రామ్ చరణ్, ఉపాసనలది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. ఇక ఈ దంపతులు గతేడాది తమ కుమార్తె క్లిన్ కారాకు…

టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది డీజే టిల్లు సినిమా. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈసినిమాలోని డైలాగ్స్, సాంగ్స్, టిల్లు యాటిట్యూడ్ అన్నీ సినిమాకు హైలెట్ నిలిచి సంచలన విజయం అందించాయి. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా సిద్దూ నటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్, పలు పాటలను రిలీజ్ చేయగా అవి కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

రామం రాఘవం ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ధనరాజ్ సినిమాల్లో కంటే జబర్దస్త్ కామెడీ షో ద్వారానే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాతా హీరోగా మారి పలు సినిమాలు కూడా చేశాడు. నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక ఇప్పుడు తానే దర్శకుడిగా మారి మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రామం రాఘవం అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమాలో డైరెక్టర్ కమ్ టాలెంటెడ్ నటుడు అయిన సముద్రఖని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా అంచనాలు బాగానే పెరిగాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే పలు పోస్టర్లను కూడా…

విశ్వంభరకు చిన్న బ్రేక్ అంటున్న చిరు
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే.

ఊరు పేరు భైరవకోన.. మా బ్యానర్‌కు నెంబర్ 1 సినిమా అవుతుంది - నిర్మాత రాజేష్ దండా
టాలీవుడ్ యంగ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం 'ఊరు పేరు భైరవకోన'. క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచరస్‌గా తెరకెక్కిన ఈ మూవీలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ భారీ బడ్జెట్లో నిర్మించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ…

తండేల్- నాగచైతన్య, సాయిపల్లవి వాలెంటైన్స్ డే సర్ ప్రైజ్
నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ను ఈమధ్యనే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. కొంతవరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది కూడా.

సౌత్ మేకర్స్ పై ఇమ్రాన్ హష్మీ ఆసక్తికర కామెంట్స్
సౌత్ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే కదా. విభిన్నమైన సినిమాలను చేస్తూ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారు. అందుకే ఒకప్పటికే పోల్చుకుంటే సౌత్ సినిమాలకు ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఇప్పుడు మారింది. ఒకప్పుడు హాలీవుడ్ తరువాత బాలీవుడ్ అన్నట్టు ఉండేది.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కరోనా తరువాత బాలీవుడ్ ఇంకాస్త వెనుకపడిపోయింది. మళ్లీ ఇప్పుడిప్పుడే విజయాలను అందుకుంటుంది.

వేలంటైన్స్ డే సందర్భంగా.. మిస్టర్ బచ్చన్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో నటించిన ‘ఈగల్’ చిత్రం ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రదర్శించబడుతోన్న విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల పేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది. ఈ క్రమంలో రవితేజ హీరోగా నటిస్తున్న మరో చిత్రం 'మిస్టర్ బచ్చన్'. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఫుల్ స్వింగ్ లో కంగువ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్
సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఈసినిమా వస్తుంది.. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది.

రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో తేజ్
మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆమధ్య రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే కదా. ఆ ప్రమాదం నుండి కోలుకోవడానికి తేజ్ కు చాలా సమయమే పట్టింది. అందుకే అప్పటినుండీ తనకు కుదిరినప్పుడల్లా డ్రైవింగ్ గురించి కానీ, హెల్మెట్ ప్రాధాన్యత గురించి కానీ చెబుతూనే ఉన్నారు. ఇక తాజాగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నాడు. హైదరాబాద్ పోలీసులు సుల్తాన్-ఉల్-ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీలో నిర్వహించిన రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించమని.. మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు.

దేవర షూటింగ్ అప్డేట్
జనతా గ్యారేజ్ తరువాత డైరెక్టర్ కొరటాల శివ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబో లో వస్తున్న చిత్రం దేవర. ఈసినిమా రెండు భాగాలుగా రానుంది.అందులో భాగంగా ప్రస్తుతం పార్ట్ 1 షూటింగ్ స్టేజ్ లో వుంది.ఇక ఇటీవల ఈసినిమాలో విలన్ గా నటిస్తున్న హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ గాయపడడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది దేవర టీం.ఇక ఇప్పుడు షూటింగ్ మళ్ళీ స్టార్ట్ కానుంది.ఈనెల 16నుండి కొత్త షెడ్యూల్ మొదలు కానుంది.ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణించనున్నారు.

గాంజా శంకర్ కు లైన్ క్లియర్
గత ఏడాది విరూపాక్షతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.ఈసినిమా తరువాత తేజ్ పక్కా మాస్ చేయలనుకున్నాడు దాంతో డైరెక్టర్ సంపత్ నంది చెప్పిన కథకు ఓకే చెప్పాడు.అదే గాంజా శంకర్.అక్టోబర్ లోనే సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది అయితే ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు దాంతో సినిమా బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయిందని ఇటీవల వార్తలు వచ్చాయి.అయితే వీటిలో నిజం లేదని తెలిసింది.ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ బరువు తగ్గే పనిలో వున్నాడట అందుకే సినిమా ఆలస్యం అవుతుందట.

స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న చరణ్
సినిమా సినిమాకు హీరోలు తమ మేకోవర్ ను మార్చుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ప్రేక్షకులు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి వారిని మెప్పించడానికి అయినా హీరోలు లుక్స్ ను ఛేంజ్ చేయాల్సిందే. ఇక హీరో రామ్ చరణ్ కూడా ఎప్పుడూ కొత్త లుక్స్ ను ట్రై చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా చరణ్ కు సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యాడ్ కోసం చరణ్ చాలా స్టైలిష్ గా రెడీ అయ్యాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ తో చేసిన తన కొత్త హెయిర్ స్టైల్ లుక్ లో చరణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫొటోలను అలీమ్ హకీమ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈఫొటోలు వైరల్ అవుతున్నాయి.

వ్యూహం, శపథం ట్రైలర్ రిలీజ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలను పొలిటికల్ డ్రామాగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు 2014-19 మధ్య కాలంలో ఆయన.. ‘పవర్ స్టార్’, ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ మరియు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తదితర చిత్రాలను తీసిన విషయం గుర్తుండే ఉంటుంది.

భైరవ కోన ప్రీమియర్స్ కు షాకింగ్ రెస్పాన్స్
టైగర్ తరువాత యంగ్ హీరో సందీప్ కిషన్ ,డైరెక్టర్ వి ఐ ఆనంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన.రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం,ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమాకు హైప్ క్రీయేట్ అయ్యింది.తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ బజినెస్ కూడా చేసింది.మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది అయితే అంత కన్నా ముందే కంటెంట్ మీద వున్న నమ్మకంతో రేపు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను వేయనున్నారు.

సూరరై పోట్రు హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా ‘సూరరై పోట్రు’ . డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జిఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా సూరారై పోట్రు తెరకెక్కింది. కరోనా వల్ల ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అయినా కూడా ఈసినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈసినిమా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగులో కూడా ఆకాశం నీ హద్దురా టైటిల్ తో రిలీజ్ అయింది.

బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. రీ రిలీజ్‌కి సిద్దమైన సమరసింహారెడ్డి
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్లో ఆల్ టైం హిట్స్‌లో ఒకటిగా నిలిచిన మూవీ 'సమరసింహారెడ్డి'. 1999లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. విడుదలైన అన్ని ఏరియాల్లో రికార్డుల మోత మోగించి అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. బాలకృష్ణ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్‌తో చాలా థియేటర్లు రీ మోడలింగ్ చేయించుకున్నాయంటే ఏ రేంజ్ హిట్టో అర్ధం చేసుకోవచ్చు. తెలుగునాట ఫ్యాక్షన్ జానర్ చిత్రాలకు నాందిగా నిలిచింది, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది ఈ సినిమానే.

టిల్లు స్క్వేర్ ట్రైలర్ రెడీ అవుతుంది
మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈసినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది చిత్రయూనిట్. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టికెట్టే కొనకుండా అనే పాటను అలానే రాధిక అనే పాటను రిలీజ్ చేయగా అవి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

రవితేజ కిక్.. రీ రిలీజ్‌కి రెడీ
టాలీవుడ్లో ఇటీవల రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన అగ్ర హీరోల సినిమాలను మళ్ళీ నేటి టెక్నాలజీని వినియోగించి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరుల చిత్రాలు ఇలా రెండోసారి విడుదలై మంచి కలెక్షన్స్ సాధించిపెట్టాయి నిర్మాతలకు. ఈ నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజా రవితేజ సినిమా ఒకటి మరోసారి థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. కాగా తెలుగు రాష్ట్రాలలో డిజిటల్ మీడియా రంగంలో నెం.1 గా ఉన్న మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తుండటం గమనార్హం.