శేఖర్ కమ్ముల దర్శకత్వంలో టాలెంటెడ్ నటుడు ధనుష్ ఇంకా కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ ను కూడా ఇటీవలే మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే. ప్రస్తుతానికి DNS అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ వచ్చింది. ఈసినిమా ఓవర్సీస్ రిలీజ్ రైట్స్ ను ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది. డ్రీమ్జ్ ఎంటర్ టైన్ మెంట్ అనే సంస్థ ఈసినిమా ఓవర్సీస్ రైట్స్ ను సొంతం చేసుకొని అక్కడ రిలీజ్ చేయనుంది. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Explosive Announcement 💥📢 !!!
We are Happy to announce our collaboration🤝 with @SVCLLP & @amigoscreation for overseas release of #DNS#DNS OVERSEAS RELEASE BY @TeamDreamZE
All set for #DNS ❤️🔥@dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula @AsianSuniel… pic.twitter.com/RwdEsk9d1Z
— DreamZ Entertainment UK (@TeamDreamZE) February 10, 2024
కాగా ఈసినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ తో పాటు పలు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: