చరణ్ కు బన్నీ స్వీట్ బర్త్ డే విషెస్

allu arjun sweet birthday wishes to ram charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో రామ్ చరణ్ కు మెగా ఫ్యాన్స్ నుండి, సెలబ్రిటీల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుతున్నాయి. అంతేకాదు రామ్ చరణ్ కొత్త సినిమాల నుండి అప్ డేట్లు వచ్చేస్తున్నాయి. దీనిలో భాగంగానే గేమ్ ఛేంజర్ నుండి ఇప్పటికే జరగండి అంటూ వచ్చే కలర్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కూడా చరణ్ కు తన సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ ను అందించాడు. హ్యాపీ బర్త్ డే టు మై మోస్ట్ స్పెషల్ కజిన్.. లవ్ యూ అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇక చరణ్ కు బన్నీ చెప్పిన స్వీట్ బర్త్ డే విషెస్ పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో పేరు సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. ఈసినిమా తరువాత బుచ్చిబాబు తో సినిమా చేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 1 =