టిల్లు స్క్వేర్ యూఎస్ ప్రీ సేల్స్ లో దూకుడు

tillu square movie usa pre sales update

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈసినిమా పలుమార్లు రిలీజ్ డేట్ ను మార్చుకున్నా ఫైనల్ గా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డీజే టిల్లు ఎఫెక్ట్ తో ఈసినిమాకు క్రేజ్ బాగానే పెరిగింది. ఇప్పుడు ఆ ప్రభావం ఈసినిమా ప్రీ సేల్స్ మీద చూపిస్తుంది. మార్చి 28 వ తేదీన యూఎస్ ప్రాంతం లో ప్రీమియర్ షో లు మొదలు కానున్నాయి. ఇక అక్కడ ఈసినిమా ప్రీ సేల్స్ లో దూకుడు ప్రదర్శిస్తుంది. ఇప్పటి వరకూ 150 కే డాలర్లకు పైగా ప్రీ సేల్స్ తో వసూళ్లు రాబట్టింది. ప్రీమియర్స్ కి ఇంకా ఒక రోజు మిగిలి ఉండటం తో, ఈ వసూళ్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరి చూద్దాం ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో.

కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ మిరియాల ,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా..సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =