మంజుమ్మల్ బాయ్స్.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్

Manjummel Boys Movie to be Released in Telugu on April 6

లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ ‘మంజుమ్మల్ బాయ్స్’ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒక యదార్థ సంఘటన స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంతమంది స్నేహితుల కథను వెండితెరపై అద్భుతంగా చూపించిన సినిమాయే ఈ ‘మంజుమ్మల్ బాయ్స్’. ప్రపంచ మార్కెట్‌లో రూ. 200 కోట్లను సంపాదించిన మొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది ఈ బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్. చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మలయాళీ ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మళయాళంలోనే కాకుండా ఇతర భాషల ప్రేక్షకుల నుంచి కూడా ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిశ్చయించుకుంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు హక్కులను సొంతం చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇప్పుడీ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‍గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 6న ‘మంజుమ్మల్ బాయ్స్’ థియేటర్లలోకి వస్తోంది.

కాగా పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు వెర్షన్‌ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. షైజు ఖలీద్ డీవోపీ కాగా, సుశిన్ శ్యామ్ సంగీతం అందించారు. వివేక్ హర్షన్ ఎడిటర్‌గా.. అజయన్ చలిసేరి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. కాగా 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మల్ యువకుల నిజమైన అనుభవం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’. ఇక మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు వెర్షన్‌కు బ్యాకింగ్ ఇవ్వడంతో ఇక్కడా అదే టైటిల్‌తో రిలీజ్ అవుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − seventeen =