షాక్ ,మిరపకాయ్ తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్,మాస్ రాజా రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్.ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగి గా కనిపించనున్నాడు.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ప్రస్తుతం కీలకమైన యాక్షన్ సీక్వెన్క్ ను చిత్రీకరిస్తున్నారు.దానికి సంబంధించిన స్టిల్ ను సోషల్ మీడియా లో అప్లోడ్ చేశాడు హరీష్ శంకర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.జూలై లేదా ఆగస్టు లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఇక రవితేజ ఈ ఫిబ్రవరి లో ఈగల్ తో రాగ త్వరలోనే మిస్టర్ బచ్చన్ తో పలకరించనున్నాడు.ఈసినిమా తరువాత చేయబోయే సినిమాకు రవితేజ ఇప్పటివరకు అయితే కమిట్ కాలేదు కానీ జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్, రవితేజ తో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.ఈవిషయం లో మాత్రం క్లారిటీ రావాల్సి వుంది.
అటు హరీష్ శంకర్ కు మిస్టర్ బచ్చన్ తోపాటు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా లైన్లో వుంది.ఇప్పటివరకు 30శాతం మాత్రమే షూటింగ్ కంప్లీట్ అయ్యింది.ప్రస్తుతం పవన్ ఎలక్షన్స్ లో బిజీ గా ఉండడం తో షూటింగ్ హోల్డ్ లో వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: