తలైవా 171 పై లోకేష్ కనగరాజ్ అప్ డేట్

lokesh kanagaraj update on thalaivar 171 movie

ఈ వయసులో కూడా రజనీకాంత్ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే లాల్ సలామ్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ప్రస్తుతం అయితే రజనీకాంత్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెట్టైయాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. కాగా మంజు వారియర్, రితికా సింగ్ కూడా ఈసినిమాలో నటిస్తున్నారు. అమితాబ్ ఇంకా రానా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు తలైవా లోకేష్ కనగరాజ్ తో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త టైమే పడుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా గురించి ఒక అప్ డేట్ ఇచ్చాడు లోకేష్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ కనగరాజ్ ఈసినిమా గురించి మాట్లాడుతూ.. రజనీకాంత్‌తో కలసి వర్క్‌ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈసినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది.. షూటింగ్‌ మొదలుపెట్టడానికి, ప్రీప్రొడక్షన్ వర్క్‌ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని తెలిపాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 1 =