ఆసినిమా చిరంజీవి-చరణ్ రీమేక్ చేస్తే బాగుంటుంది

prithviraj sukumaran about his bro daddy movie remake

మలయాళం సినిమాలకు ఇప్పుడు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే కదా. అందుకే అక్కడి సినిమాలను ఇక్కడ రిలీజ్ చేయడమే కాదు రీమేక్ లు కూడా చేస్తూ వస్తున్నారు. ఇక ఇక్కడ కూడా ఆ సినిమాలు మంచి విజయాలనే అందుకుంటున్నాయి. ఈనేపథ్యంలో ఓ మలయాళం సినిమాను చిరంజీవి-చరణ్ రీమేక్ చేస్తే బావుంటుంది అని అంటున్నాడు మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పృథ్వీరాజ్ సుకుమారన్ నుండి రాబోతున్న సినిమా ఆడు జీవితం. బ్లెస్సీ దర్శకత్వంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. మార్చి28వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా తెలుగులో కూడా రిలీజ్ కానున్న ఈనేపథ్యంలో పృథ్వీ రాజ్ తెలుగు ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీ రాజ్ ను తన బ్రో డాడీ సినిమాను తెలుగులో ఎవరు రీమేక్ చేస్తే బాగుంటుంది అని అడుగగా.. ఈసినిమాను తెలుగులో రీమేక్ చేస్తారో?లేదో? నాకు తెలియదు కానీ ఈసినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి-చరణ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నానని తెలిపారు. మరి ఎవరైనా పృథ్వీరాజ్ మాటలను విని చరణ్-చిరుతో ఈసినిమా రీమేక్ చేసే ప్రయత్నం చేస్తారేమో చూద్దాం.

కాగా కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన బ్రో డాడి సినిమా పృథ్వీరాజ్ సుకుమారనే దర్శకత్వంలోనే వచ్చింది. ఈసినిమాలో మోహన్ లాల్ తండ్రిగా, పృథ్వీరాజ్ కొడుకుగా నటించారు. ఈసినిమా డైరెక్ట్ గా ఓటీటీలో నే రిలీజ్ అవ్వగా సూపర్ హిట్ అయింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 15 =