
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 74


OG టైటిల్ పై మేకర్స్ క్లారిటీ- మార్చేది లేదు

రామ్ చరణ్ నా సొంత కొడుకు లాంటి వాడు

హిందీలో కూడా డెవిల్- ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు

బ్రో సినిమా ఛాన్స్ పై అలీ రెజా ఎమోషనల్ పోస్ట్

గుంటూరు కారం కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్లు

గోపీచంద్ 22 ఏళ్ల సినీ జర్నీ

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న భోళా శంకర్

ఇంట్రెస్టింగ్ గా జైలర్ షోకేస్

సెన్సేషనల్ గా బిజినెస్ మేన్ టికెట్ బుకింగ్స్

పెళ్లి వార్తలపై తరుణ్ క్లారిటీ

‘భోళా శంకర్’లో మెగాస్టార్‌తో స్క్రీన్ పంచుకోవడమే ఒక అదృష్టం - హీరో సుశాంత్
మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడమే ఒక అదృష్టం అని పేర్కొన్నారు టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్. త్వరలో విడుదల కానున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ చిత్రంలో మెగాస్టార్‌తో కలిసి ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో సుశాంత్ ఈ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ.. ''నా జీవితంలో ఏదీ ప్లాన్ చేసింది కాదు. హీరోగా కానీ.. గెస్ట్ రోల్ లేదా సపోర్టింగ్ రోల్ ఇలా ఏదైనా నా వద్దకు వచ్చిన పాత్రలు చేస్తున్నాను. ఈ క్రమంలోనే ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో అల్లు అర్జున్ తో కలిసి నటించాను. అయితే బన్నీకి కూడా చిరంజీవి గారే స్ఫూర్తి. ఇందులో దర్శకుడు త్రివిక్రమ్…

OG టైటిల్ పై మేకర్స్ క్లారిటీ- మార్చేది లేదు
ఈమధ్య వర్కింగ్ టైటిల్స్ తోనే సినిమాలు షూటింగ్ లను మొదలుపెడుతున్నారు. షూటింగ్ సగం అయిన తరువాత లేదా ఇక ఏదైనా స్పెషల్ డేస్ కు టైటిల్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న టైటిల్ లో ఏమాత్రం మార్పు లేదు అంటున్నారు మేకర్స్. సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఓజీ. ఈసినిమా లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది.

రామ్ చరణ్ నా సొంత కొడుకు లాంటి వాడు
ఒకవైపు డైరెక్టర్ గా మరోవైపు నటుడిగా తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు సముద్రఖని. రీసెంట్ గానే బ్రో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన లో వచ్చిన బ్రో సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించాడు. ఈసినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.

హిందీలో కూడా డెవిల్- ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఏడాది అమిగోస్ అంటూ డిఫరెంట్ కథతో వచ్చాడు. ఇక ఇప్పుడు డెవిల్ అంటూ వచ్చేస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఈసినిమాను చాలా సైలెంట్ గా మొదలుపెట్టి..అంతే సైలెంట్ గా షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రబృందం. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది…

ఓటీటీలోకి వచ్చేసిన భాగ్ సాలే
ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వంలో శ్రీసింహా హీరోగా వచ్చిన సినిమా భాగ్ సాలే. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ భాగ్ సాలే జూలై 7, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైమండ్ రింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నశ్రీసింహాకు ఈసినిమా కూడా నిరాశనే మిగిల్చింది. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమాను నేడు రిలీజ్ చేశారు. మరి థియేటర్లలో చూడటం మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

రియల్ ఇన్సిడెంట్స్ తో NC23- శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు
టాలీవుడ్ లో కాస్త డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇష్టపడే హీరోల్లో నాగచైతన్య పేరు కూడా ఉంటుంది. సినిమా రిజల్ట్ లను పక్కనపెడితే ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి నాగచైతన్య ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇక రీసెంట్ గా కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగచైతన్య. ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు.

భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు
ప్రస్తుతం మెగాఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా నుండి ఇప్పటికే పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

బ్రో సినిమా ఛాన్స్ పై అలీ రెజా ఎమోషనల్ పోస్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి సినిమా వస్తే బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంటుందో మరోసారి బ్రో సినిమాతో రుజువైంది. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా బ్రో. కాలం ప్రాధాన్యతను తెలుపుతూ తీసిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఏ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుందో చూస్తూనే ఉన్నాం. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈసినిమాకు థమన్ సంగీతం అందించాడు.

గుంటూరు కారం కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్లు
గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో హిట్ ను అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు గుంటూరు కారం అంటూ వచ్చేస్తున్నాడు. మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. గత సినిమాల్లో కంటే భిన్నంగా ఈసినిమాలో ఫుల్ మాస్ పాత్రలో అలరించనున్నట్టు ఇప్పుటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. అయితే మధ్యలో కాస్త బ్రేక్ పడింది. రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇప్పడు నిర్విరామంగా షూటింగ్ ను జరుపుతున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది…

గోపీచంద్ 22 ఏళ్ల సినీ జర్నీ
తొలివలపు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో గోపీచంద్. మొదటి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. అయితే ఒకసారి హీరోగా ఎంట్రీ ఇచ్చి విలన్ పాత్రలు చేయాలంటే కాస్త వెనుకాడతారు. కానీ గోపీచంద్ మాత్రం ఏమాత్రం సంశయించకుండా విలన్ పాత్రలు చేయడానికి ఒప్పుకున్నాడు. ఒకరకంగా అప్పుడు ఆవిలన్ రోల్స్ వల్లే ఇప్పుడు గోపీచంద్ హీరోగా ఈస్థాయిలో ఉన్నాడని చెప్పొచ్చు. జయం సినిమాలో విలన్ గా నటించిన గోపీచంద్ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తరువాత నిజం, వర్షం సినిమాల్లో కూడా విలన్ పాత్రలు చేసి మెప్పించాడు. ఇక 2004లో వచ్చిన యజ్ఞం సినిమా గోపీచంద్ కెరీర్ ను ఓ మలుపు…

బెదురులంక2012- దొంగోడే దొరగాడు సాంగ్ రిలీజ్
క్లాక్స్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక 2012. వరుసగా పరాజయాలు అందుకుంటున్న కార్తికేయ ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ పలు కారణాలవల్ల ఈసినిమా రిలీజ్ చాలా లేట్ అయింది. ఈమధ్యే ఓ పన్నీ వీడియోతో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఎట్టకేలకు ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీపికా పదుకొణె పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రభాస్
ప్రముఖ నటి దీపికా పదుకొణేపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన తన సహనటి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'కల్కి 2898 AD' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దీపికతో కలిసి పనిచేసిన అనుభవం గురించి మాట్లాడమని లేడీ యాంకర్ అడగగా ప్రభాస్ ఇలా అన్నారు. "దీపిక 'బిగ్గెస్ట్ సూపర్ స్టార్'. ఆమె అత్యంత అందమైన మహిళ. నేను ఆమెను ఎప్పుడూ ప్రేమిస్తున్నాను. ఇక నేను ఆమెతో కలిసి పని చేయాలని చాలాకాలం నుంచి అనుకుంటున్నాను. ఇప్పటికి ఆ అవకాశం…

స్కంద నుండి నీచుట్టూ చుట్టూ ఫుల్ సాంగ్ రిలీజ్
ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్కంద. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తిచేస్తూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈసినిమా గ్లింప్స్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మాస్ ఆడియన్స్ కు ఈసినిమా బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది.

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న భోళా శంకర్
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ల తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాతో చిరు హ్యాట్రిక్ కొట్టాలని ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ కూడా వరుస అప్ డేట్లతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. దానికి తోడు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచాయి తప్పా ఎక్కడా తగ్గించలేదు. మరోసారి ఈసినిమాలో చిరంజీవి తన ఎనర్జిటిక్ అండ్ మాస్ పెర్ఫామెన్స్ తో అలరించబోతున్నాడని…

ఇంట్రెస్టింగ్ గా జైలర్ షోకేస్
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయసులో కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన చివరి సినిమా అన్నాత్తే. 2021లో ఆసినిమా రిలీజ్ అయింది. ఇక ఆసినిమా తరువాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్.

నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ నుండి డేంజర్ పిల్లా సాంగ్ రిలీజ్
స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. ఇక భీష్మ తరువాత ఇప్పటివరకూ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయిన నితిన్ ఈసినిమాతో ఎలాగైనా మంచి హిట్ ను కొట్టాలని చూస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఒకవైపు షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా టైటిల్ ను రీసెంట్ గానే రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ సింగిల్ డేంజర్ పిల్లా అనే పాటను నేడు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా…

భోళా శంకర్ ఫుల్ ప్యాకేజ్ మాస్ ఎంటర్ టైనర్- డీవోపీ డడ్లీ
మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నమోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్'. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని టాప్ ట్రెండింగ్ లో వుంది. ఇక ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో ఈసినిమా సినిమాటోగ్రాఫర్…

కల్కి2898 AD- ఇండియన్ మైథాలజీ ప్లస్ వెస్ట్రన్ ఇన్ఫ్లూయెన్స్
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సినీ లవర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇక సినిమా రిలీజ్ కు ముందే ఈసినిమా అంతర్జాతీయ లెవల్లో గుర్తింపును తెచ్చుకుంది. రీసెంట్ గానే చిత్రయూనిట్ శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే కదా. ఇక అక్కడే ఈసినిమా టైటిల్ ను అలానే గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్ అయితే సోషల్…

సెన్సేషనల్ గా బిజినెస్ మేన్ టికెట్ బుకింగ్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా గుంటూరు కారం. ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

పెళ్లి వార్తలపై తరుణ్ క్లారిటీ
సోషల్ మీడియా వాడకం ఎక్కువైన తరువాత హీరో హీరోయిన్లపై రూమర్లు రావడం కామన్ అయిపోయింది. అయితే కొంతమంది వాటిపై స్పందిస్తారు.. మరికొంతమంది మొదట్లో స్పందించినా తరువాత మాత్రం లైట్ తీసుకుంటారు. ఇక తాజాగా హీరో తరుణ్ కూడా తనపై వచ్చిన వార్తలను ఖండించారు. ఎంతోకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ సైలెంట్ గా ఉన్న హీరో తరుణ్ పై వచ్చిన వార్తలు ఏంటంటే.. తరుణ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని.. అది కూడా మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నాడన్న పలు కథనాలు తెరపైకి వచ్చాయి.