మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ల తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాతో చిరు హ్యాట్రిక్ కొట్టాలని ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ కూడా వరుస అప్ డేట్లతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. దానికి తోడు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచాయి తప్పా ఎక్కడా తగ్గించలేదు. మరోసారి ఈసినిమాలో చిరంజీవి తన ఎనర్జిటిక్ అండ్ మాస్ పెర్ఫామెన్స్ తో అలరించబోతున్నాడని అర్థమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ సిద్దంగా ఉంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలియచేస్తూ పోస్ట్ చేసింది. చిరంజీవి మాస్ యుఫోరియాని ఆగష్టు 11న థియేటర్స్ లో చూస్తారు అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. మరి చూద్దాం ఈసినిమాతో చిరు హ్యాట్రిక్ అందుకుంటాడో? లోదో?
#BholaaShankar 🔱
Certified with U/A 😇
All set to entertain you all in Theatres from AUGUST 11th ❤️🔥Experience Mega 🌟 @KChiruTweets‘s MASSive Euphoria on the Big screens worldwide💥
A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA… pic.twitter.com/jmUHrchuhr
— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) August 2, 2023
కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: