కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 75

talented actor vijay sethupathi to act in karthis sardar 2 movie
సినిమా వార్తలు

సర్దార్ 2 లో విలక్షణ నటుడు?

తెలుగు ప్రేక్షకులకు తమిళ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యుగానికి ఒక్కడు సినిమాతోనే తనలో మంచి నటుడిని పరిచయం చేశాడు. ఇక ఆతరువాత ప్రతి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఈమధ్య పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో హిట్లను అందుకున్నాడు. ప్రస్తుతం అయితే జపాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు కార్తీ. రాజు మురుగన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అర్థమైపోయింది. డిఫరెంట్ మేకోవర్ తో కార్తీ గెటప్ ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
bro movie producer tg vishwa prasad solid reply on collections
బాక్సాఫీస్

బ్రో కలెక్షన్స్ పై నిర్మాత సాలిడ్ రిప్లై

సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ బ్రో. ఈసినిమా వినోదయ సీతం అనే సినిమాకు రీమేక్ గా వచ్చిన సినిమా అన్న సంగతి తెలిసిందే. ఇక ఇక్కడ కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ ను అందుకుంది. కాలం ఎంత విలువైందో చెబుతూ మెసేజ్ ఒరియెంటెడ్ నేపథ్యంలో ఈసినిమా రావడంతో దానికి తోడు ఎమోషనల్ కంటెంట్ కూడా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ కూడా ఏ రేంజ్ లో వస్తున్నాయో చూస్తున్నాం. కేవలం మూడు రోజుల్లోనే ఈసినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిందంటేనే అర్థం చేసుకోవచ్చు. పవన్ సత్తా ఏంటో మరోసారి బాక్సాఫీస్ కు చూపించాడు.

TFN Adminవాట్సాప్
prabhas salaar movie first single update
సినిమా వార్తలు

సలార్- రెడీ అవుతున్న ఫస్ట్ సింగిల్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మేనియా అప్పుడే మొదలైపోయింది. గతకొంతకాలంగా ఆదిపురుష్ కోసం వెయిట్ చేయగా ఆసినిమా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది సలార్ సినిమా కోసం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. నిజానికి సెప్టెంబర్ 28 వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది చిత్రయూనిట్. అయితే రిలీజ్ కు ఇంకా చాలా రోజులు ఉన్నా కూడా అప్పుడే సలార్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది.

TFN Adminవాట్సాప్
vd13 movie team celebrate mrunal thakur birthday
సినిమా వార్తలు

VD13 సెట్ లో మృణాల్ బర్త్ డే సెలబ్రేషన్స్

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ లు అయిపోతుంటారు కొంతమంది హీరోలు, హీరోయిన్లు. అయితే అది కొంతమందికే కలిసొస్తుంది అనుకోండి. ఇక ఒక్క సినిమాతో ఒక్క తెలుగులో ఏంటి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది మృణాలు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సినిమా సీతారామం. పీరియాడిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటించి తన నటనతో మెప్పించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక ఈసినిమాతో అమ్మడు తెలుగులో మంచి అవకాశాలే అందుకుంటుంది. ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న హాయ్ నాన్న సినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
bro movie vijaya yatra begins
సినిమా వార్తలు

బ్రో విజయోత్సవ యాత్ర మొదలు

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్రో సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. తమిళ్ లో వచ్చి సూపర్ హిట్ అయిన వినోదయ సితం అనే సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. అయితే పాయింట్ అదే అయినా కూడా ఇక్కడ ప్రేక్షకులకు తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసి పవన్ ఫ్యాన్స్ కు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ను యాడ్ చేశారు. అలా రిలీజ్ కు ముందు నుండ్ అప్డేట్లతో సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఈసినిమా కూడా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ నటన, పవన్-తేజ్ ల కాంబినేషన్…

TFN Adminవాట్సాప్
star hero dulquer salmaan in suriyas new film
సినిమా వార్తలు

సూర్య సినిమాలో మలయాళ స్టార్ హీరో?

డిఫరెంట్ కథలను ఎంచుకోవడంలో.. విభిన్నమైన పాత్రలు చేయడంలో తమిళ్ స్టార్ హీరో సూర్య ఎప్పుడూ ముందుంటాడు. అందుకే వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. భారీ బడ్జెట్ ఈసినిమా రాబోతుంది. శివ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఇక గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు. రీసెంట్ గానే ఈసినిమా గ్లింప్స్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాని స్టూడియో…

TFN Adminవాట్సాప్
star heroine samantha enjoying her break in bali trip
సినిమా వార్తలు

బాలి ట్రిప్ ఎంజాయ్ మెంట్ లో సామ్

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇండస్ట్రీలో దాదాపు శబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది సమంత . నిజానికి కెరీర్ సాఫీగా సాగుతున్నప్పుడు హీరోయిన్స్ ఏమాత్రం బ్రేక్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉండరు. కానీ సామ్ మాత్రం అందుకు విరుద్దం. తను ఏం చేయాలను కుంటుందో అదే చేసే అలవాటు ముందు నుండీ సామ్ కు ఉంది. అందుకే ప్రస్తుతం బిజీగా ఉన్నా కూడా ఒక ఏడాది పాటు షూటింగ్ లకు బ్రేక్ చెప్పేసింది. ఇక ఈ బ్రేక్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో తను చేసిన పోస్ట్ లను బట్టి చెప్పొచ్చు ఎంత ఎంజాయ్ చేస్తుందో.

TFN Adminవాట్సాప్
mrunal thakur birthday poster out from hi nanna movie
ఫస్ట్ లుక్

హాయ్ నాన్న నుండి మృణాల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

న్యాచురల్ స్టార్ నాని మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది ఇప్పటికే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీ వచ్చేస్తున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. దసరా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత నాని నుండి వస్తున్న సినిమా.. మరోవైపు సీతారామం లాంటి క్లాసిక్ హిట్ తరువాత మృణాల్ ఠాకూర్ చేస్తున్నసినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమాలో కూడా నాని డిఫరెంట్ పాత్రలో నటించనున్నాడు. 6ఏళ్ల కూతురికి తండ్రిగా ఈసినిమాలో నటించనున్నాడు. తండ్రి…

TFN Adminవాట్సాప్
bedurulanka 2012 third single release date fixed
సాంగ్

బెదురులంక 2012- దొంగోడే దొరగాడు సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు కార్తికేయ. ఆ సినిమా తరువాత కార్తికేయ ఇప్పటివరకూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నటుడిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు కానీ మొదటి సినిమా తరువాత ఆరేంజ్ హిట్ ను ఇంతవరకూ అందుకోలేకపోయాాడు. ప్రస్తుతం అయితే మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక 2012. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Telugu Movies Releasing In August Month
సినిమా వార్తలు

ఆగష్ట్ లో సినిమా రిలీజ్ ల సందడి

సినీ లవర్స్ కు ప్రతి శుక్రవారం పండగ లాంటిదే. ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. సీజన్ అయితే ఒక్కోసారి నాలుగైదు సినిమాలు రిలీజ్ అయిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సమ్మర్ లో పలు సినిమాలు వరుసగా రిలీజ్ అవ్వగా.. జూన్, జులై లో ఆ జోరు కాస్త తగ్గింది. ఇక ఇప్పుడు ఆగష్ట్ నెల మాత్రం మంత్ మొదలు నుండి చివరి వరకూ వరుస రిలీజ్ లతో సందడి కానుంది. చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద సినిమాల వరకూ ఈ ఒక్క నెలలోనే చాలాా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.

TFN Adminవాట్సాప్
nee chuttu chuttu song promo released from skanda movie
సాంగ్

స్కంద నుండి నీ చుట్టూ చుట్టూ సాంగ్ ప్రోమో రిలీజ్

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత రామ్ రెడ్, వారియర్ లాంటి సినిమాల్లో కనిపించినా అవి పెద్దగా విజయాన్ని అయితే అందించలేకపోయాయి. ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
BRO Movie Entertaining Family Audience At Its Best
సినిమా వార్తలు

ఫ్యామిలీ ఆడియన్స్ తో బ్రో హౌస్ ఫుల్

మొత్తానికి పవన్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న బ్రో సినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఎక్స్ పెక్ట్ చేసినట్టే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ కు ఉండే క్రేజ్ గురించి ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కటౌట్ ఉంటే చాలు అన్నంత రేంజ్ లో ఉంటుంది. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటూ ఉంటాడు పవన్.

TFN Adminవాట్సాప్
ram skanda movie first single release date fixed
రిలీజ్ అప్‌డేట్

స్కంద ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్కంద అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజర్ ను కూడా రిలీజ్ చేయగా.. టీజర్ అయితే సినిమా పై అంచనాలను మరింత పెంచేసింది.

TFN Adminవాట్సాప్
devara new schedule begins today
షూటింగ్ అప్‌డేట్

దేవర కొత్త షెడ్యూల్ ప్రారంభం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ ఫాస్ట్ గా జరుపుకుంటుంది.అనుకున్న సమయానికి థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్ర బృందం గట్టిగానే శ్రమిస్తోంది.అందులోభాగంగా పెద్దగా గ్యాప్ తీసుకుకోండా షెడ్యూల్ లను కంప్లీట్ చేస్తున్నారు.ఇక కొద్ది రోజుల గ్యాప్ తరువాత కొత్త షెడ్యూల్ ఈరోజు శంషాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది.ఈషెడ్యూల్ లోకూడా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ప్రముఖ స్టంట్ మాస్టర్ సొలొమాన్ ఈ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.ఎన్టీఆర్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో,కలైరాసన్ తదితరుల ఫై ఈ యాక్షన్ సీక్వెన్స్ ను తీస్తున్నారు. వచ్చే నెల 7వరకు ఈ షెడ్యూల్ జరుగనుంది. కొరటాల శివ డైరెక్షన్…

Mahender Reddyవాట్సాప్
Nee Jathai full song out from Gandeevadhari Arjuna movie
సాంగ్

గాండీవధారి అర్జున నుండి నీజతై ఫుల్ సాంగ్ రిలీజ్

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ మొదటి నుండి కాస్త డిఫరెంట్ కథలను ఎంచుకోవడానికే ప్రయత్నిస్తుండేవాడు. ఒకే తరహా జోనర్‌కు పరిమితం కాకుండా ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులు, అభిమానులను అలరిస్తున్నాడు. గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే టీజర్ రిలీజ్…

TFN Adminవాట్సాప్
Dhumme Dhulipelaa song out from shah rukh jawan movie
సాంగ్

దుమ్ము దులిపేలా జవాన్ ఫస్ట్ సింగిల్

బాలీవుడ్ బాద్ షా షారుష్ ఖాన్ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక ఇసినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. జవాన్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి ప్రివ్యూ పేరుతో టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రివ్యూలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, షారుఖ్ మేకోవర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. అంతేకాదు జవాన్ తో మరో హిట్ ను అందుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి.

TFN Adminవాట్సాప్
tollywood heroes interested on full mass roles
సినిమా వార్తలు

ఊరమాస్ తో ఊపేస్తున్న హీరోలు

ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. అయితే ప్రస్తుతం తెలుగులో మాత్రం హీరోలు ఫుల్ మాస్ గా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఒకప్పుడైతే హీరో ఇలానే ఉండాలి అన్న సట్రంలో ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు ప్రేక్షకులు సినిమాను చూసే విధానం మారటం.. దానికి తగ్గట్టుగానే కొత్త కొత్త డైరెక్టర్లు వస్తుండటంతో హీరోలు కూాడా తమ పంథాను మార్చుకున్నారు. ఇప్పుడు ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు డీ గ్లామర్ పాత్రల్లో ఫుల్ ఊరమాస్ పాత్రలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడట్లేదు. దానికితోడు ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుండటంతో స్టార్ హీరోల…

TFN Adminవాట్సాప్
double ismart shooting update
షూటింగ్ అప్‌డేట్

డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ అప్డేట్

ఉస్తాద్ రామ్ పోతినేని,డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్.రీసెంట్ గా ఈసినిమా మొదటి షెడ్యూల్ ముంబై లో సార్ట్ కాగా ఈరోజుతో ముగిసింది.ఈషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈసినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.మొదటి షెడ్యూల్ షూటింగ్ లో కూడా ఆయన పాల్గొన్నాడు.ఇక తదుపరి షెడ్యూల్ విదేశాల్లో జరుగనుంది.

Mahender Reddyవాట్సాప్
raghava lawrence first look out from chandramukhi 2 movie
ఫస్ట్ లుక్

చంద్రముఖి2 నుండి లారెన్స్ రాయల్ లుక్ రిలీజ్

కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ నటుడు అయిన లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఎంతోమంది స్టార్ హీరోలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన లారెన్స్ అనంతరం హీరోగా పలు చేశాడు. అలానే డైరెక్టర్ గా కూడా పలు సినిమాలు చేశాడు. ముఖ్యంగా హార్రర్ సినిమాలు తీయడంలో ఎక్స్పర్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సూపర్ హిట్ హార్రర్ సినిమా సీక్వెల్ తో వచ్చేస్తున్నాడు. పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు…

TFN Adminవాట్సాప్
Bhagavanth Kesari Song Shoot In A Massive Set In RFC
సాంగ్

భారీ సెట్ లో భగవంత్ కేసరి భారీ సాంగ్

ఈఏడాది ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో, బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ఆందరూ ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక యూనిక్ కాన్సెప్ట్‌ తో హై యాక్షన్‌ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్న ఈసినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో అనిల్ రావిపూడి చూపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ పవర్ ఫుల్ ప్రజెన్స్, తెలంగాణ యాసలో డైలాగ్‌లని చెప్పడం ఎంతగానో అలరించింది

TFN Adminవాట్సాప్

షేర్