దీపికా పదుకొణె పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రభాస్

Pan-India Star Prabhas Interesting Comments on Actress Deepika Padukone

ప్రముఖ నటి దీపికా పదుకొణేపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన తన సహనటి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘కల్కి 2898 AD’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్‌ ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దీపికతో కలిసి పనిచేసిన అనుభవం గురించి మాట్లాడమని లేడీ యాంకర్ అడగగా ప్రభాస్‌ ఇలా అన్నారు. “దీపిక ‘బిగ్గెస్ట్ సూపర్ స్టార్’. ఆమె అత్యంత అందమైన మహిళ. నేను ఆమెను ఎప్పుడూ ప్రేమిస్తున్నాను. ఇక నేను ఆమెతో కలిసి పని చేయాలని చాలాకాలం నుంచి అనుకుంటున్నాను. ఇప్పటికి ఆ అవకాశం వచ్చింది. నేను ఆమెతో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. కాబట్టి, ఆమె సెట్‌లోకి వచ్చినప్పుడు నాతో సహా అందరికీ చాలా ఉత్సాహంగా ఉంటుంది” అని ప్రభాస్ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ క్రమంలో తాజాగా అమెరికాలో జరిగిన ‘శాండియాగో కామిక్ కాన్’ వేదికగా ఈ సినిమాకి ‘కల్కి 2898 AD’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు రిలీజ్ చేసిన గ్లింప్స్ కు విశేష స్పందన వచ్చింది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబచ్చన్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా జనవరి 12 2024 లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ కల్కితో పాటుగా ‘సలార్’ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + twelve =