నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ నుండి డేంజర్ పిల్లా సాంగ్ రిలీజ్

danger pilla song released from nithiin extra ordinary man movie

స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్. ఇక భీష్మ తరువాత ఇప్పటివరకూ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయిన నితిన్ ఈసినిమాతో ఎలాగైనా మంచి హిట్ ను కొట్టాలని చూస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఒకవైపు షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా టైటిల్ ను రీసెంట్ గానే రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ సింగిల్ డేంజర్ పిల్లా అనే పాటను నేడు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈపాటను రిలీజ్ చేశారు మేకర్స్. బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా.. చీకట్లో తిరగని మిణుగురు తళుకువా అంటూ మొదలైన ఈపాట మెలోడియస్ గా ఉండి ఆకట్టుకుంటుంది. అర్మాన్ మాలిక్ పాడిన ఈపాటకు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 23వ తేదీన ఈసినిమాను విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =