స్కంద నుండి నీచుట్టూ చుట్టూ ఫుల్ సాంగ్ రిలీజ్

skanda movie nee chuttu chuttu full song released

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్కంద. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తిచేస్తూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈసినిమా గ్లింప్స్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మాస్ ఆడియన్స్ కు ఈసినిమా బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే ముందుగానే మ్యూజికల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలో ఈసినిమా మొదటిపాట నీ చుట్టూ చుట్టూ అనే పాటను రిలీజ్ చేశారు. ఈపాట ప్రోమోను ఇప్పటికే రిలీజ్ చేయగా ప్రోమోకే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ బీట్ తో మెలోడీయస్ గా ఉన్న ఈపాట ఆకట్టుకుంటుంది. రఘురామ్ సాహిత్యం అందించిన ఈపాటను సిద్ శ్రీరామ్, సంజన కల్ మంజీ ఆలపించారు. పాట అయితే కలర్ ఫుల్ ఉండబోతుందని అర్థమవుతుంది. అంతేకాదు రామ్, శ్రీలీల ఎనర్జిటిక్ స్టెప్పులతో సిల్వర్ స్క్రీన్ పై ఈపాట అదిరిపోతుందని అర్థమవుతుంది.

కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.