ఇంట్రెస్టింగ్ గా జైలర్ షోకేస్

jailer showcase video out now

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయసులో కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన చివరి సినిమా అన్నాత్తే. 2021లో ఆసినిమా రిలీజ్ అయింది. ఇక ఆసినిమా తరువాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా రిలీజ్ కు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. ఆగష్ట్ 10వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టగా కావాలయ్య ఒక్కపాటతో సినిమాకు రావాల్సిన బజ్ మొత్తం వచ్చేసింది. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ వచ్చేసింది. జైలర్ షోకేస్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగులో నాగచైతన్య ఈవీడియోను రిలీజ్ చేశాడు. జైలర్ షోకేస్ అయితే పవర్‌ఫుల్‍గా ఉండి ఆకట్టుకుంటుంది. రజినీకాంత్ స్టైల్, స్వాగ్ అదిరిపోయేలా ఉన్నాయి. తలైవా రజినీ మార్క్ డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్‍గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్‌గా ఉంది. మొత్తానికి షోకేస్ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది.

కాగా ఈసినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్‌మోహన్‌, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + ten =