టాలీవుడ్ లో కాస్త డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇష్టపడే హీరోల్లో నాగచైతన్య పేరు కూడా ఉంటుంది. సినిమా రిజల్ట్ లను పక్కనపెడితే ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి నాగచైతన్య ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇక రీసెంట్ గా కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగచైతన్య. ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. మత్స్యకారుల వేటకు వెళ్లడం అక్కడ పాక్ సరిహద్దుల్లో చిక్కుకుపోవడం వంటి ఇతివృత్తాతం ఆదారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని సినిమా రూపంలో తీయనున్నారు. ఇక తాజాగా ఈసినిమా కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. షూటింగ్ ను త్వరలో మొదలుపెట్టనున్నట్టు తెలిపారు.
#NC23Expedition BEGINS ❤️🔥
Yuvasamrat @chay_akkineni, Director @chandoomondeti and Producer #BunnyVas join hands for a RURAL DRAMA based on TRUE INCIDENTS 🔥
The pre-production has begun with an interaction with fishermen and their families in a village in Srikakulam to… pic.twitter.com/iDPjXqd6gW
— Geetha Arts (@GeethaArts) August 3, 2023
ఇదిలా ఉండగా ఈ సినిమా నిమిత్తం నాగ చైతన్య, చందూ మొండేటి, బన్నీ వాస్ కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్లి అక్కడి మత్స్యకారుల కుటుంబాలను కలిశారు.ఈ సందర్భంగా మీడియాతో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. ”ఆరు నెలల క్రితం చందూ కథను చెప్పారు. చాలా ఎగ్జైట్ అయ్యాను. యదార్థ సంఘటనల ఆధారంగా కథను డెవలప్ చేశారు. వాస్, చందూ రెండేళ్లుగా కథపై వర్క్ చేస్తున్నారు. కథ చాలా ఇన్‌స్పైరింగ్ గా ఉంది. మత్స్యకారుల జీవనశైలిని తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చాం. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఈ రోజు మొదలౌతున్నాయి’ అని అన్నారు.
చందూ మొండేటి మాట్లాడుతూ.. ఇక్కడ స్థానికుడు కార్తీక్ 2018లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా కథను సిద్ధం చేశాడు. మొదట అరవింద్‌గారికి, బన్నీ వాస్‌గారికి కథ చెప్పాడు. కథ వినగానే ఎగ్జైట్ అయ్యాను. గత రెండేళ్లుగా స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధంగా వుంది. చాలా బాగా వచ్చింది. నాగచైతన్య గారు ఈ కథ పట్ల చాలా అనందంగా వున్నారు. సంఘటన జరిగిన చోటే సినిమా ప్రీ ప్రొడక్షన్‌ను ప్రారంభించాలనుకున్నాం’’ అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: