ప్రస్తుతం మెగాఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా నుండి ఇప్పటికే పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు. ఇక ఇప్పుడు భోళా సెలబ్రేషన్స్ కు సిద్దమయ్యారు. తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను వేదికను ఖరారు చేస్తూ ప్రకటించారు. ఆగష్ట్ 6వ తేదీన ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శిల్పకళావేదికలో సాయంత్రం 7 గంటల నుండి నిర్వహించనున్నారు.
It’s time for the MEGA celebrations 😎🤘
Grand #BholaaShankar Pre-Release Celebrations on August 6th at Shilpakalavedika, Hyderabad from 7PM onwards💥💥
Mega 🌟 @KChiruTweets
A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @SagarMahati… pic.twitter.com/DMwjq4pKET— AK Entertainments (@AKentsOfficial) August 3, 2023
కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: