సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా గుంటూరు కారం. ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ మూవీ బిజినెస్ మేన్ సినిమా రీ రిలీజ్ కు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే కదా. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. సూర్యా భాయ్ పాత్రలో మహేష్ ఇంటెన్స్ యాక్షన్, పూరీ డైలాగ్స్, మేకింగ్ అన్నీ సినిమాను హిట్ గా నిలిపాయి. ఇక్కడ మాత్రమే కాదు అప్పట్లో నార్త్ లో కూడా ఈసినిమా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. 4కే క్వాలిటీతో ఆగష్ట్ 9 వ తేదీన ఈసినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. అయితే అలా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారో లేదో గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దీంతో ఈసినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి అర్థమవుతుంది. ఇక ఇక్కడ మాత్రమే కాదు ఓవర్‌సీస్‌లో కూడా పెద్ద ఎత్తున బిజినెస్ మేన్ స్పెషల్ షోస్‌ను ప్లాన్ చేస్తున్నారు. కాగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈసినిమాకు థమన్ సంగీతం అందించాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పై ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: