సోషల్ మీడియా వాడకం ఎక్కువైన తరువాత హీరో హీరోయిన్లపై రూమర్లు రావడం కామన్ అయిపోయింది. అయితే కొంతమంది వాటిపై స్పందిస్తారు.. మరికొంతమంది మొదట్లో స్పందించినా తరువాత మాత్రం లైట్ తీసుకుంటారు. ఇక తాజాగా హీరో తరుణ్ కూడా తనపై వచ్చిన వార్తలను ఖండించారు. ఎంతోకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ సైలెంట్ గా ఉన్న హీరో తరుణ్ పై వచ్చిన వార్తలు ఏంటంటే.. తరుణ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని.. అది కూడా మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నాడన్న పలు కథనాలు తెరపైకి వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు ఆవార్తలను ఎంటర్ టైన్ చేయకుండా వెంటనే తరుణ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. తన పైళ్లి పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నారు. మరి తరుణ్ ఇచ్చిన క్లారిటీ ఇప్పటికైనా ఈవార్తలకు బ్రేక్ పడుతుందేమో చూడాలి.
కాగా బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి అతి చిన్న వయసులో తన నటనతో ఆకట్టుకున్నాడు తరుణ్. అనంతరం నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సంచలనం విజయం అందుకున్నాడు. ఆ తర్వాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను, నువ్వే నువ్వే లాంటి సినిమాలు తరుణ్ కెరీర్ ను మార్చేశాయి.. వరుసగా పలు హిట్లను అందుకొని లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే అనంతరం వరుసగా ఫ్లాప్స్ ను మూటగట్టుకున్నాడు. దానికితోడు ప్రస్తుతం కాంపిటీషన్ కూడా ఎక్కువవడం..కొత్త కొత్త హీరోలు పరిచయం అవుతుండటంతో తరుణ్ సినిమాలకు దూరమయ్యాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: