పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి సినిమా వస్తే బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంటుందో మరోసారి బ్రో సినిమాతో రుజువైంది. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా బ్రో. కాలం ప్రాధాన్యతను తెలుపుతూ తీసిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఏ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుందో చూస్తూనే ఉన్నాం. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈసినిమాకు థమన్ సంగీతం అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో నటుడు అలీ రెజా కూడా ఒక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో అలీ రెజాకు ఈసినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చిందకు గాను తన ట్విట్టర్ ద్వారా సముద్రఖనిని థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సముద్రఖని సార్.. బ్రో సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు గాను.. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బ్రో సినిమాలో నేను కూడా ఆయనతో స్క్రీన్ పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలను తెలపడానికి వెయిట్ చేస్తున్నా.. బ్రో సినిమాలో ఒక చిన్న పాత్రలో నేను కూడా ఉన్నాను అని చెప్పినప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు. పవన్ ను దగ్గరనుండి గమనించడం.. ఆయన నుండి నేర్చుకోవడం అనేది లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఈ పాత్రకోసం నన్ను తీసుకున్నందుకు నా ఎబిలిటీస్ ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్.. ఈ అవకాశం ముందు ముందు నేను నటుడిగా ఎదగడానికిమార్గం అయింది.. కొత్త బాధ్యతలను ఇచ్చింది.. ఈసినిమాలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా గౌరవంగా భావిస్తున్నా.. మరోసారి థాంక్యూ సార్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు. అయితే అలీ రెజా పోస్ట్ కు సముద్రఖని స్పందిస్తూ నువ్వు దానికి అర్హుడవు అంటూ రిప్లై ఇచ్చాడు.
U deserve it BRO … ❤️❤️❤️ https://t.co/mafMWJitDP
— P.samuthirakani (@thondankani) August 3, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: