ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సినీ లవర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇక సినిమా రిలీజ్ కు ముందే ఈసినిమా అంతర్జాతీయ లెవల్లో గుర్తింపును తెచ్చుకుంది. రీసెంట్ గానే చిత్రయూనిట్ శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే కదా. ఇక అక్కడే ఈసినిమా టైటిల్ ను అలానే గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్ అయితే సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడియన్స్ కు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుందని అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా కామిక్ కాన్ ఈవెంట్ కి వెళ్లిన చిత్రయూనిట్ అక్కడ పలు మీడియాలతో ముచ్చటించారు. ఈనేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్, నాగ్ అశ్విన్, కమల్ హాసన్ ఈ సినిమాగురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఈసందర్భంగా నాగ్ అశ్విన్ ఈసినిమా ఇండియన్ మైథాలజీ ఇంకా వెస్ట్రన్ ఇన్ల్పూయన్స్ ఉన్న పలు బుక్స్, కామిక్స్ సమ్మేళనంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇంకా కమల్ హాసన్ మాట్లాడుతూ ఈసినిమాపై నాగ్ అశ్విక్ కు ఉన్న విజనే నన్ను ఈసినిమా సెట్ లో అడుగుపెట్టేలా చేసిందని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: