ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 69

రీ రిలీజ్‌కు సిద్దమైన 7/G బృందావన కాలనీ

RC 16 మూవీ అప్డేట్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రారంభం

ఆదికేశవ రిలీజ్ డేట్ ఫిక్స్

జైలర్ 7డేస్ కలెక్షన్స్

బెదురులంక 2012 ట్రైలర్ రిలీజ్
నల్గొండ జిల్లా పర్యటనలో అల్లు అర్జున్.. గజమాలతో స్వాగతం పలికిన ఫ్యాన్స్
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శనివారం నల్గొండ జిల్లాలో సందడి చేశారు. ఒక్కరోజు పర్యటనకు విచ్చేసిన ఆయన జిల్లాలోని పెద్దవూర మండలం, బట్టు గూడెం గ్రామంలో తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారన్న సమాచారం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే మెగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరై అల్లు అర్జున్‌కు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం దారి పొడవునా బైక్ ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

రీ రిలీజ్‌కు సిద్దమైన 7/G బృందావన కాలనీ
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తున్న రీ రిలీజ్‌ల పరంపరలోకి మరో కల్ట్ సినిమా వచ్చి చేరింది. సుమారు 2 దశాబ్దాల క్రితం యువతరాన్ని ఉర్రుతలూగించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ మరోసారి విడుదలకు సిద్ధమైంది. సాధారణంగా ఎక్కువ సినిమాలు ప్రేక్షకులకు తక్కువ కాలం గుర్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఎన్ని సంవత్సరాలు గడిచినా అభిమానులు సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుని మైమరిచిపోయేలా చేస్తాయి. అలాంటివాటిలో ఎక్కువగా ప్రేమ కథలే ఉంటాయి. ఈ కోవలో వచ్చిందే 2004లో విడుదలైన '7/G బృందావన కాలనీ' సినిమా. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ విడుదలై 200 రోజులకి పైగా థియేటర్లలో ఆడి ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్…

సెన్సార్ పూర్తి చేసుకున్న కార్తికేయ బెదురులంక 2012
టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి గుర్తింపు పొందిన ఈ జెనరేషన్ హీరోల్లో కార్తికేయ ఒకరు. 'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అనంతరం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. అయితే కార్తికేయ కేవలం హీరోగా మాత్రమే కాకుండా తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో నెగటివ్ రోల్స్‌లో సైతం నటించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ క్రమంలో ఆయన హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం 'బెదురులంక 2012'. తాజాగా ఈసినిమా నుండి ఓ అప్‌డేట్ వచ్చింది. సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. కాగా…

బ్రహ్మానందం తనయుడి వివాహం.. హాజరైన పలువురు సినీ ప్రముఖులు
టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం (ఆగస్టు 18, 2023) రాత్రి ఘనంగా జరిగింది. బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల కుమార్తె ఐశ్వర్యను సిద్ధార్థ వివాహమాడారు. తల్లిదండ్రులు, అతిథుల సమక్షంలో ఏడు అడుగులు నడిచి ఐశ్వర్య, సిద్ధార్థ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద గల అన్వయ కన్వెన్షన్స్‌లో రాత్రి 10.45 గంటలకు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అగ్రనటులు నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదితరులు విచ్చేసి సందడి…

RC 16 మూవీ అప్డేట్
ఉప్పెనతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సన.ఈసినిమా తరువాత ఈ డైరెక్టర్ ఏకంగా స్టార్ హీరో ను డైరెక్ట్ ఛాన్స్ కొట్టేశాడు.అందులో భాగంగా తన రెండో సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నాడు.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుంది ఈసినిమా.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రారంభం
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు కలల చిత్రం (డ్రీమ్ ప్రాజెక్ట్) ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈ చిత్రానికి ముహూర్తం కుదిరింది. ఈరోజు శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించారు. 'అవా ఎంటర్టైన్మెంట్' మరియు '24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ' పతాకంపై విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ విష్ణు సరసన కథానాయికగా నటించనుంది. దివంగత సీనియర్ నటుడు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా నటించిన ఒకప్పటి సూపర్ హిట్ చిత్రం ఈ ‘భక్త కన్నప్ప’. అయితే…

ఆదికేశవ రిలీజ్ డేట్ ఫిక్స్
మొదటి సినిమా ఉప్పెన తో హీరో గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఆ తరువాత కొండపొలం,రంగ రంగ వైభవం తో అదే జోరును కొనసాగించలేకపోయాడు.ఇక ఇప్పుడు ఈ హీరో ఆదికేశవ తో రానున్నాడు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను ఈనెల 18న విడుదల చేయాలని అనుకున్నారు కానీ షూటింగ్ పూర్తి కాకపోయేసరికి వాయిదా వేశారు.ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.నవంబర్ 10న థియేటర్లలోకి రానుందని సినిమా నుండి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి తెలియజేశారు.ఈపోస్టర్ లో వైష్ణవ్ తేజ్,హీరోయిన్ శ్రీ లీల రొమాంటిక్ పోజ్ లో కనిపించారు.ఇంతకుముందు ఈసినిమా నుండి వచ్చిన గ్లింప్స్ సూపర్…

బేబి ఓటిటి డేట్ వచ్చేసింది
గత నెలలో చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది బేబి.లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబట్టింది.నిర్మాత లెక్కల ప్రకారం ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 90కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇక ఈసినిమా ఓటిటి లోకి వస్తుంది.ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా ఈసినిమా ను ఈనెల 25నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.అయితే ఆహా గోల్డ్ సభ్యత్వం కలిగిన సబ్ స్క్రైబర్స్ మాత్రం ఈనెల 24 సాయంత్రం 6గంటల నుండే చూసేయొచ్చు.ఇక మరి థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న బేబి ఓటిటి లో కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి .

మహేష్ బాబు పెట్ డాగ్ మృతి.. నమ్రత, సితార భావోద్వేగం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పెంపుడు కుక్క మరణించింది. వారికి గల కుక్కల్లో ప్లూటో అనే పేరు కలిగిన ఈ కుక్క తాజాగా చనిపోయింది. దీంతో మహేష్ కుటుంబ సభ్యులు విచారంలో మునిగిపోయారు. ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ మరియు కుమార్తె సితార సోషల్ మీడియా వేదికగా ఆ కుక్కతో తమకు గల అనుబంధాన్ని వెల్లడించారు. భావోద్వేగ పోస్టులతో ప్లూటోను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్లూటోని చాలా మిస్ అవుతున్నాం అంటూ ఒక పోస్టును పెట్టారు. ఆమె దానిని సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే, వారి కుమార్తె సితార కూడా ప్లూటో మృతికి హృదయపూర్వక నివాళిని పంచుకున్నారు. 'గత ఏడేళ్లుగా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్…

నిఖిల్ సిద్ధార్థ్ కొత్త సినిమా 'స్వయంభూ' షూటింగ్ ప్రారంభం
టాలీవుడ్ యంగ్ హీరోలలో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న వారిలో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. నిఖిల్ స్క్రిప్ట్ సెలక్షన్ చూసి స్టార్స్ కూడా ఆశ్చర్యపోతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. దీంతో నిఖిల్ తన తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన 'స్పై' చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా నార్త్ ఇండియాలో భారీ ఓపెనింగ్స్ రాబట్టడం గమనార్హం. ఈ క్రమంలో మరో రెండు సాలిడ్ హిట్లు పడితే నిఖిల్ అగ్ర హీరోల లిస్టులో చేరిపోతాడని సినీ ఎనలిస్టుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో నేడు (గురువారం…

యోగి రీ-రిలీజ్.. థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ మాస్ జాతర
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖ హీరోల ఒకప్పటి సినిమాలను మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ నయా ట్రెండ్ అనూహ్యంగా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతోంది. దీంతో నిర్మాణ సంస్థలు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలువురు స్టార్ హీరోల సినిమాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అలాగే మరోవైపు ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోలు సూపర్ హిట్ సినిమాల్ని మళ్లీ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ చేరింది. తాజాగా యోగి సినిమా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈశ్వరి ఫిలిమ్స్ బ్యానర్ పైన తెరకెక్కిన ఈ…

ఓటిటి లోకి హిందీ ఛత్రపతి
తెలుగు రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన ఛత్రపతి ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.ఇది వచ్చిన 18సంవత్సరాల తరువాత దీన్ని హిందీ లో అదే టైటిల్ తో రీమేక్ చేశారు.యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాతో హీరోగా హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు.ఈఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యింది.అయితే రిజల్ట్ ను పక్కన పడితే ఎట్టకేలకు ఈసినిమా ఓటిటి లో రిలీజ్ అవుతుంది.జీ 5 ఈసినిమాను రేపటి నుండి స్ట్రీమింగ్ లోకి వస్తుంది.ప్రముఖ తెలుగు డైరెక్టర్ వి వి వినాయక్ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయగా నుశరత్ బరూచా హీరోయిన్ గా నటించింది.శరద్ కేల్కర్ విలన్ పాత్రలో కనిపించాడు.తనిష్క్ బాఘ్చి సంగీతం అందించాడు.పెన్ స్టూడియోస్ నిర్మించింది.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొత్త చిత్రం 'భ్రమయుగం' ప్రారంభం
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కథానాయకుడిగా కొత్త సినిమా ప్రారంభమైంది. 'భ్రమయుగం' అనే పేరుతో హారర్ థ్రిల్లర్ కథాంశంగా ఇది రూపొందనుంది. కేరళలోని కొచ్చిలో ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కేరళలో నిర్వహించిన వేడుకలో ఈ మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. సినిమా చిత్రీకరణ ప్రారంభం సందర్భంగా మమ్ముట్టి సహా మూవీ టీమ్ ఓ పోస్టర్ ని కూడా విడుదల చేసింది. అందులో డార్క్ షేడ్స్ లో ఓ ఇల్లు కనిపిస్తుండగా.. దాని ముందు ఓ వ్యక్తి చేతిలో కాగడా పట్టుకొని కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూడటానికి ఆసక్తికరంగా ఉంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ మరియు వై నాట్ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను పాన్ ఇండియా…

రజినీకాంత్ ‘జైలర్’లోని 'కావాలయ్యా' పాటకు జపాన్ అంబాసిడర్ స్టెప్పులు
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా అందులోని 'కావాలయ్యా' పాట అయితే అంతకుమించి అన్నట్లుగా హిట్ అయింది. ఆ సినిమా విడుదలకు ముందే ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. అనిరుధ్ సంగీతానికి తోడు నటి తమన్నా హుక్ స్టెప్ డాన్స్ యావత్ దేశాన్ని ఆకర్షించింది. ఫేస్‌బుక్, యూ ట్యూబ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. దీంతో ప్రతి ఒక్కరూ ఈ పాటకు రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. రజినీకాంత్ అభిమానులే కాదు.. పలువురు ప్రముఖులు కూడా ఈ పాటకు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ పాటకు భారతదేశంలోని జపాన్ రాయబారి…

జైలర్ 7డేస్ కలెక్షన్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుంది.అయితే ఈ వారం రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా నిరాశపరచకుండా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.వర్కింగ్ డేస్ లో కూడా అద్భుతమైన హోల్డ్ ను కొనసాగిస్తూ సెన్సేషనల్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ఇక ఈసినిమా వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 375.40కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందని చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించింది.అయితే ఈ కలెక్షన్స్ ఇంకా అన్ని ఏరియాల్లో నుండి అప్డేట్ కావాల్సివుందని తెలిపింది.అలా చూస్తే మొత్తం కలిపి 400కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

'గేమ్ ఛేంజర్' సెట్స్‌లో డైరెక్టర్ శంకర్ బర్త్ డే సెలెబ్రేషన్స్
తమిళ అగ్ర దర్శకుడు ఎస్ శంకర్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఇది ఆయనకు 60వ పుట్టినరోజు కావడం విశేషం. అయితే ఆయన తన పుట్టినరోజును 'గేమ్ ఛేంజర్' మూవీ సెట్స్‌లో జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు చిత్ర నిర్మాత దిల్ రాజు.. డైరెక్టర్ శంకర్‌తో కేక్ కట్ చేయించి బర్త్ డే విషెస్ చెప్పారు. వీరితో పాటు 'గేమ్ ఛేంజర్' మూవీ టీమ్ దర్శకుడు శంకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో వేసిన సెట్స్‌లో గేమ్ ఛేంజర్ టీమ్ అంతా కలిసి ఎస్ శంకర్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇక ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో…

ఫ్యాన్స్‌కి నాగార్జున 'బర్త్ డే' ట్రీట్.. 'మన్మథుడు' రీ రిలీజ్
టాలీవుడ్ గ్రీకువీరుడు అక్కినేని నాగార్జున ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. తన 'బర్త్ డే' సందర్భంగా.. ఆయన వారికి సూపర్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఈనెల 29న కింగ్ నాగార్జున జన్మదినం అన్న విషయం ఆయన అభిమానులతో పాటు సినీప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో నాగార్జున కెరీర్‌లో నిలిచిపోయే చిత్రాల్లో ఒకటిగా పేరొందిన ‘మన్మథుడు’ సినిమాను రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఈ మేరకు నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ పోస్టర్‌ను షేర్ చేసింది. కాగా ‘మన్మథుడు’ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నిర్మించిన సంగతి తెలిసిందే.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్
ఈసమ్మర్ లో దాస్ కా ధమ్కీ తో వచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు యంగ్ హీరో విశ్వక్ సేన్.ఇక ఈ ఏడాది రెండో సారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. అందులో భాగంగా విశ్వక్ సేన్,గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో రానున్నాడు.ఇందులో విశ్వక్ రగ్గడ్ లుక్ తో ఊర మాస్ పాత్రలో కనిపించనున్నాడు.తాజాగా ఈసినిమా నుండి మొదటి పాటను విడుదలచేశారు.సుట్టంలా సూసి అంటూ సాగే ఈ సాంగ్ బాగుంది.శ్రీ హర్ష ఈపాటను రచించగా అనురాగ్ కులకర్ణి గాత్రాన్ని అందించాడు.యువన్ శంకర్ రాజా ఇచ్చిన సంగీతం పాటను మరోస్థాయికి తీసుకెళ్లింది.ఇక ఈసాంగ్ లాంచ్ కార్యక్రమంలో హీరో హీరోయిన్ కలిసి లైవ్ డ్యాన్స్ ఫర్ఫార్మ్ చేశారు.

'వ్యూహం' మూవీ రెండో టీజర్ విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ.. పేరుకి తెలుగు డైరెక్టర్ అయినా.. బాలీవుడ్ లో కూడా సత్తా చూపిన దర్శకుడు. గతంలో రంగీలా, సత్య, సర్కార్ వంటి ఎన్నో కల్ట్ సినిమాలను తీసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గడచిన కొన్ని సంవత్సరాలుగా ఆయన తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమకాలీన రాజకీయ పరిస్థితులపై దృష్టి పెట్టిన ఆయన వరుసగా ఈ నేపథ్యంలోనే సినిమాలు తీస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో.. 'పవర్ స్టార్', 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' మరియు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లాంటి సినిమాలను రామ్ గోపాల్ వర్మ తీసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో వర్మ 'వ్యూహం' అనే సినిమాను…

బెదురులంక 2012 ట్రైలర్ రిలీజ్
ఆర్ ఎక్స్ 100తరువాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ కోసం చాలా రోజులనుండి ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో కార్తికేయ.ఆర్ఎక్స్ 100తరువాత హీరోగా 5సినిమాలు చేసినా మంచి విజయాన్ని దక్కించుకోలేకపోయాడు.దాంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని బెదురులంక 2012 అనే సినిమాతో వస్తున్నాడు.