ఉప్పెనతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సన.ఈసినిమా తరువాత ఈ డైరెక్టర్ ఏకంగా స్టార్ హీరో ను డైరెక్ట్ ఛాన్స్ కొట్టేశాడు.అందులో భాగంగా తన రెండో సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నాడు.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుంది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను జనవరి నుండి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారని సమాచారం.అంతేకాదు ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈసినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించనున్నాడని టాక్.అయితే ఈవిషయాన్ని అధికారకంగా ప్రకటించాల్సి వుంది.పాన్ ఇండియా మూవీ గా రానున్న ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్,వ్రిద్ది సినిమాస్,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది చివర్లో థియేటర్లలోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ కొద్దీ రోజులనుండి హైదరాబాద్ లో జరుగుతుంది.సోషల్ మేసేజ్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్ ,ఎస్ జె సూర్య ,నవీన్ చంద్ర ,అంజలి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈసినిమా వచ్చే ఏడాది విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























