యోగి రీ-రిలీజ్.. థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ మాస్ జాతర

Prabhas Fans Mass Celebrations at Theatres on Yogi Re-Release Today

టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖ హీరోల ఒకప్పటి సినిమాలను మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ నయా ట్రెండ్ అనూహ్యంగా నిర్మాత‌ల‌కు లాభాలను తెచ్చిపెడుతోంది. దీంతో నిర్మాణ సంస్థలు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలువురు స్టార్ హీరోల సినిమాలను థియేట‌ర్ల‌లోకి తీసుకొస్తున్నారు. అలాగే మ‌రోవైపు ఫ్యాన్స్ కూడా త‌మ అభిమాన హీరోలు సూప‌ర్ హిట్ సినిమాల్ని మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లోకి పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మూవీ చేరింది. తాజాగా యోగి సినిమా మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈశ్వరి ఫిలిమ్స్ బ్యానర్ పైన తెరకెక్కిన ఈ మూవీని తాజాగా చందు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై లింగం యాదవ్ రీ-రిలీజ్ చేశారు. యోగి సినిమా రీ రిలీజ్ కు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు సహకారం అందించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్ల వద్ద రెబెల్ స్టార్ ఫ్యాన్స్ మాస్ జాతర చేస్తున్నారు. ప్రభాస్ భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకం చేస్తున్నారు. దీంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. కాగా వీవీ వినాయ‌క్ దర్శకత్వంలో 2007లో రిలీజైన ఈ మూవీ ప్ర‌భాస్‌కు మంచి పేరు తెచ్చింది. ‘ఛ‌త్ర‌ప‌తి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత ప్రభాస్ న‌టించిన సినిమా ఇదే. మొత్తం 225కుపైగా థియేట‌ర్ల‌లో రిలీజై రికార్డ్ క్రియేట్ చేసింది. మ‌ద‌ర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో ప్ర‌భాస్‌కు తల్లిగా సీనియ‌ర్ న‌టి శార‌ద నటించగా.. జోడీగా న‌య‌న‌తార కనిపించింది. ఇక ర‌మ‌ణ గోగుల సంగీతాన్ని అందించిన యోగి సినిమాలోని పాటలు ప్రేక్షకులను అలరించాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + twenty =