మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రారంభం

Manchu Vishnu's Dream Project Kannappa Begins

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు కలల చిత్రం (డ్రీమ్ ప్రాజెక్ట్) ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈ చిత్రానికి ముహూర్తం కుదిరింది. ఈరోజు శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించారు. ‘అవా ఎంటర్టైన్మెంట్‌’ మరియు ’24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ’ పతాకంపై విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కృతి సనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌ విష్ణు సరసన కథానాయికగా నటించనుంది. దివంగత సీనియర్ నటుడు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా నటించిన ఒకప్పటి సూపర్ హిట్ చిత్రం ఈ ‘భక్త కన్నప్ప’. అయితే ఈ సినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నామని కొన్ని నెలల క్రితం మంచు కుటుంబం వెల్లడించింది. దీంతో ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. వాస్తవానికి కృష్ణంరాజుతో మోహన్ బాబుకు మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాను రీమేక్ చేయనున్నట్లు మోహన్ బాబు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే నేను రిస్క్ తీసుకుంటున్నాను. నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా కానుంది. బడ్జెట్ సుమారు 150 కోట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం మా సొంత ప్రొడక్షన్‌లో ఈ సినిమా చేస్తున్నాం. ఒకవేళ తర్వాత ఎవరైనా ఈ ప్రాజెక్టులో భాగమైతే అప్పుడు ఆ వివరాలు వెల్లడిస్తాను. ఈ సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. స్టార్‌ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్‌’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తారు. సీనియర్‌ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్‌ మరియు తోట ప్రసాద్‌ ఈ కథకు తుది మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌ తో, హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో భక్త కన్నప్ప, అతని గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజేస్తాం. త్వరలో షూటింగ్‌ మొదలుపెట్టి సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేస్తాం. ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో చాలా భాషల్లో రిలీజ్ చేస్తాం’ అని విష్ణు తెలిపారు.

కాగా దివంగత సీనియర్ నటుడు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా నటించిన ఈ చిత్రం 1976లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి కళాత్మక దర్శకుడు బాపు దర్శకత్వం వహించగా.. వాణిశ్రీ, రావుగోపాలరావు, శ్రీధర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై కృష్ణంరాజు సోదరుడు యువి సూర్యనారాయణరాజు నిర్మించారు. తెలుగునాట ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ మహాత్మ్యం నేపథ్యంలో ‘భక్త కన్నప్ప’గా ప్రసిద్ధుడైన తిన్నడు కథను స్ఫూర్తిగా తీసుకుని సినిమాగా తీశారు. హీరో కృష్ణంరాజు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది. ఈ మూవీ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. అయితే కృష్ణంరాజు నటించిన ఈ సినిమాను రీమేక్ చేయాలని అడపాదడపా టాలీవుడ్‌లో చర్చ జరిగింది కానీ, ఎవరూ సాహసించలేకపోయారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 13 =