ఫ్యాన్స్‌కి నాగార్జున ‘బర్త్‌ డే’ ట్రీట్.. ‘మన్మథుడు’ రీ రిలీజ్‌

Manmadhudu Movie Ready For Re-release on Nagarjuna's Birthday Aug 29

టాలీవుడ్ గ్రీకువీరుడు అక్కినేని నాగార్జున ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. తన ‘బర్త్‌ డే’ సందర్భంగా.. ఆయన వారికి సూపర్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఈనెల 29న కింగ్ నాగార్జున జన్మదినం అన్న విషయం ఆయన అభిమానులతో పాటు సినీప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో నాగార్జున కెరీర్‌లో నిలిచిపోయే చిత్రాల్లో ఒకటిగా పేరొందిన ‘మన్మథుడు’ సినిమాను రీ రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఈ మేరకు నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ పోస్టర్‌ను షేర్ చేసింది. కాగా ‘మన్మథుడు’ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నిర్మించిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీ రిలీజ్ ట్రెండ్‌లో భాగంగా ఇప్పటికే పలు హీరోల సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాగార్జున జన్మదినం సందర్భంగా ఆగస్టు 29న ‘మన్మథుడు’ సినిమా రీ రిలీజ్‌కి సిద్దమైంది. దీంతో నాగార్జున అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు ‘మన్మథుడు’ తనకు ఎంతో ఇష్టమైన సినిమా అని హీరో అడివి శేష్ ట్వీట్ చేయడం విశేషం.

2002లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీవీలలో వస్తుంటే.. ఇప్పటికీ ప్రేక్షకులు అలాగే అతుక్కుపోతారంటే అతిశయోక్తి కాదు. ‘మన్మథుడు’ ప్రేమ కథే అయినప్పటికీ సున్నితమైన హాస్యంతో పాటుగా హృదయాన్ని హత్తుకునే కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను మైమరిపించాయి. అందుకే విడుదలైనప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రేమకథలకు తనదైన మార్క్ కామెడీ కలగలిపి తీయడంలో దిట్ట అయిన కె. విజయ్ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఇక ‘మన్మథుడు’లో అభిరామ్‌గా నాగార్జున నటనను ఎవరూ మర్చిపోలేరు. అలాగే హారిక పాత్రలో సోనాలి బింద్రే, మహేశ్వరిగా అన్షు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీని ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. ముఖ్యంగా నేడు అగ్రదర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు డైలాగ్ రైటర్ గా పనిచేయడం గమనార్హం. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. దీంతో ఈ సినిమా రీ-రిలీజ్‌ చేయనున్న నేపథ్యంలో మరోసారి భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమని నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ భావిస్తోంది. అయితే తన పుట్టినరోజు సందర్భంగా నాగార్జున తదుపరి సినిమాపై ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.