రజినీకాంత్‌ ‘జైలర్‌’లోని ‘కావాలయ్యా’ పాటకు జపాన్‌ అంబాసిడర్‌ స్టెప్పులు

Japan Ambassador Dances To Kaavaalaa Song From Superstar Rajinikanth's Latest Hit Jailer Movie

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా అందులోని ‘కావాలయ్యా’ పాట అయితే అంతకుమించి అన్నట్లుగా హిట్ అయింది. ఆ సినిమా విడుదలకు ముందే ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. అనిరుధ్ సంగీతానికి తోడు నటి తమన్నా హుక్ స్టెప్ డాన్స్ యావత్ దేశాన్ని ఆకర్షించింది. ఫేస్‌బుక్‌, యూ ట్యూబ్‌, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. దీంతో ప్రతి ఒక్కరూ ఈ పాటకు రీల్స్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. రజినీకాంత్ అభిమానులే కాదు.. పలువురు ప్రముఖులు కూడా ఈ పాటకు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ పాటకు భారతదేశంలోని జపాన్ రాయబారి ‘హిరోషీ సుజుకీ’ కూడా ఇంప్రెస్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతే.. ఆయన కూడా ఈ పాటకు కాలు కదిపారు. తద్వారా సూపర్ స్టార్ రజనీకాంత్‌పై తన ప్రేమను ప్రదర్శించారు. హిరోషి సుజుకి జపనీస్ ప్రముఖ యూట్యూబర్ మాయో సాన్‌తో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. ట్రెండింగ్‌లో ఉన్న ఈ పాటకు వీరిద్దరూ హుక్ స్టెప్ డ్యాన్స్ వేసి విజయవంతంగా రీక్రియేట్ చేసారు. కాగా ఈ వీడియో హిరోషీ సుజుకీ తన X (ట్విట్టర్‌) హ్యాండిల్‌లో షేర్ చేశారు. ”జపనీస్ యూట్యూబర్ మాయో సాన్‌తో కావాలా డ్యాన్స్ వీడియో @MayoLoveIndia. రజనీకాంత్‌పై నా ప్రేమ కొనసాగుతుంది” అని దీనికి క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో నెటిజెన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. కాగా రజినీకాంత్ కు జపాన్ లో భారీగా అభిమానులు ఉన్న విషయం తెలిసిన విషయమే.

ఇక రజినీకాంత్‌ నటించిన ‘జైలర్‌’ చిత్రం ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలిరోజునుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, ప్రియాంక అరుళ్‌మోహన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ అందించిన మ్యూజిక్‌ బాగా ప్లస్ అయింది. ప్రత్యేకించి రజినీకాంత్ ఎలివేషన్స్ సీన్స్ లో ఇచ్చిన బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అని అభిమానులు కితాబిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన‌ ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్ మరియు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఇందులో క్యామియో రోల్స్ వేయడం గమనార్హం. చాలా రోజుల తర్వాత రజినీకాంత్ సాలిడ్ హిట్ అందుకున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 8 =