సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుంది.అయితే ఈ వారం రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా నిరాశపరచకుండా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.వర్కింగ్ డేస్ లో కూడా అద్భుతమైన హోల్డ్ ను కొనసాగిస్తూ సెన్సేషనల్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ఇక ఈసినిమా వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 375.40కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందని చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించింది.అయితే ఈ కలెక్షన్స్ ఇంకా అన్ని ఏరియాల్లో నుండి అప్డేట్ కావాల్సివుందని తెలిపింది.అలా చూస్తే మొత్తం కలిపి 400కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Alapparai kelappitom 💥🔥🔥#JailerRecordMakingBO@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @mirnaaofficial @kvijaykartik @Nirmalcuts @KiranDrk @StunShiva8… pic.twitter.com/d0gvpwUwyy
— Sun Pictures (@sunpictures) August 17, 2023
తమిళ సినిమా చరిత్రలో అతి తక్కువ రోజుల్లో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన మొదటి సినిమాగా జైలర్ రికార్డు సృష్టించింది.ఇక తెలుగు రాష్ట్రాల్లో జైలర్ 50కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసింది.7రోజుల్లో 52కోట్ల వసూళ్లను రాబట్టింది.కేవలం 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈసినిమా ఇప్పుడు భారీ లాభాలను అందిస్తుంది.ఫుల్ రన్ లో జైలర్ 65కోట్ల మార్క్ ను చేరుకోనుంది.అటు తమిళంలో ఈసినిమా విక్రమ్ లైఫ్ టైం కలెక్షన్స్ క్రాస్ చేసింది.ఇప్పటివరకు అక్కడ 130కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఇక రోబో 2.0 తరువాత జైలర్ తో రజినీ మళ్ళీ తన సత్తా ఏంటో చూపెడుతున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: