తమిళ అగ్ర దర్శకుడు ఎస్ శంకర్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఇది ఆయనకు 60వ పుట్టినరోజు కావడం విశేషం. అయితే ఆయన తన పుట్టినరోజును ‘గేమ్ ఛేంజర్’ మూవీ సెట్స్‌లో జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు చిత్ర నిర్మాత దిల్ రాజు.. డైరెక్టర్ శంకర్‌తో కేక్ కట్ చేయించి బర్త్ డే విషెస్ చెప్పారు. వీరితో పాటు ‘గేమ్ ఛేంజర్’ మూవీ టీమ్ దర్శకుడు శంకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో వేసిన సెట్స్‌లో గేమ్ ఛేంజర్ టీమ్ అంతా కలిసి ఎస్ శంకర్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇక ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో సెట్స్ నుండి పంచుకున్న వీడియోలో, రామ్ చరణ్ తన ప్రత్యేక రోజున దర్శకుడికి కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చూడవచ్చు. కాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, ఎస్ శంకర్ దర్శకత్వంలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా దర్శకుడు శంకర్ 90వ దశకం ప్రారంభంలో తన అరంగేట్రం చేసాడు. అర్జున్ సర్జాతో చేసిన తొలిసినిమా ‘జెంటిల్ మెన్’ తో ఇండస్ట్రీ హిట్ అందించాడు. ఆ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, శివాజీ, రోబో, రోబో-2, స్నేహితుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తీసి అప్పటినుంచి తమిళ సినిమాల్లో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరైన శంకర్ సాధారణంగా తన సినిమాలలో సామాజిక మరియు రాజకీయ అంశాలను స్పృశిస్తుంటాడు. అలాగే నిర్మాతగా ‘ఎస్ పిక్చర్స్’ అనే బ్యానర్ పెట్టి యువ దర్శకులకు మరియు నటీనటులకు తన సినిమాల ద్వారా అవకాశాలు ఇస్తున్నాడు. కాగా దర్శకుడు శంకర్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సహా ‘ఇండియన్ 2’ సినిమాలను ఏకకాలంలో చేస్తున్నారు. ఇక ‘ఇండియన్ 2’లో లోక నాయకుడు కమల్ హాసన్‌తో కలిసి పనిచేస్తున్నారు. 1996లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ఇండియన్’కి సీక్వెల్ గా దీనిని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: